పేలుడు పదార్థాల కర్మాగారంలో పేలుడు: 10మంది సజీవదహనం

Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడు రాష్ట్రం తిరుచ్చిలోని పేలుడు కర్మాగారంలో గురువారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో పది మంది మృతి చెందగా, మరో 15మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కర్మాగారం వద్దకు సాహాయక బృందాలు, అధికారులు చేరుకున్నారు.

explosives blast near trichy: 10 killed

పది అగ్నిమాపక శకటాలు, ఆంబులెన్స్‌ సర్వీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో కర్మాగారంలో 20 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. పేలుడు తీవ్రత రెండు కిలోమీటర్ల వరకు ఉందనిస్థానికులు తెలిపారు.

తురైయూర్‌ ప్రాంతంలో వాహనాలు కొద్దిసేపటి వరకు నిలిపివేశారు. నడా తుపాను కారణంగా వర్షాలు పడుతుండడంతో సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతున్నట్లు అధికారులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు పూర్తిగా అదుపుచేశారు. తిరుచ్చి జిల్లా కలెక్టర్‌, ఎస్పీ ఘటనాస్థలికి చేరుకునిఘటనపై విచారణ చేపట్టారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
10 workers were killed in an explosives blast in a factory near Trichy. Rescue teams have rushed to the factory.
Please Wait while comments are loading...