వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫోర్బ్స్ సంపన్నుల జాబితా: ప్రతి 17 గంటలకో కొత్త బిలియనీర్... సంపన్నుల అడ్డాగా బీజింగ్

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
తొలిసారిగా ప్రపంచ కుబేరుల జాబితాలోకి ఎక్కిన పాపులర్ టీవీ స్టార్ కిమ్ కర్డాషియన్ వెస్ట్

గత ఏడాది నుంచి కరోనావైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. కానీ, అదే సమయంలో కొత్త సంపన్నుల సంఖ్య కూడా భారీగా పెరిగిందని ఫోర్బ్స్ మ్యాగజీన్ తెలిపింది.

ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాను ఫోర్బ్స్ మ్యాగజీన్ ఇటీవల విడుదల చేసింది. ఆ జాబితా ప్రకారం..

ఎలాన్ మస్క్ అదే వేగంతో ముందుకు దూసుకుపోతున్నారని, కొత్తగా కిమ్ కర్డాషియన్ వెస్ట్ కోటీశ్వరుల జాబితాలో చేరారని ఫోర్బ్స్ పేర్కొంది.

"ఓపక్క మహమ్మారి విజృంభిస్తున్నప్పటికీ, ప్రపంచ ధనవంతుల సంపద రికార్డ్ స్థాయిలో 5 ట్రిలియన్ డాలర్లు పెరిగింది. అంతేకాకుండా, మునుపెన్నడూ లేనంతమంది కొత్త కోటీశ్వరులు ఈ జాబితాలో చేరారు" అని ఈ ప్రాజెక్ట్ నిర్వహించిన ఫోర్బ్స్ ఎడిటర్ కెర్రీ ఎ. డోలన్ తెలిపారు.

2021 ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో మొత్తం 2,755మంది ఉన్నారు. ఈ జాబితాలోని ముఖ్యంశాలు ఇవి.

తారాజువ్వలా దూసుకెళ్లిన కుబేరుల సంఖ్య

2021లో 1 బిలియన్ (100 కోట్లు) డాలర్లు లేదా అంతకన్నా ఎక్కువ సంపదతో ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో చేరిన సంఖ్య 2,755.

అంతకుముందు సంవత్సరం కంటే ఈసారి 600 మంది పెరిగారు.

వారంతా కూడా 13.1 ట్రిలియన్ యూఎస్ డాలర్ల సంపద కూడబెట్టారని అంచనా. 2020లో ఈ సంఖ్య 8 ట్రిలియన్ యూఎస్ డాలర్లు.

కరోనావైరస్ సంక్షోభం ఉన్నప్పటికీ వీరిలో 86 శాతం మంది తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకున్నారు.

2021 ధనవంతుల జాబితాలో 493 కొత్త పేర్లు చేరాయని ఫోర్బ్స్ తెలిపింది.

అంటే ప్రతి 17 గంటలకు ఒక కొత్త బిలియనీర్ పుట్టుకొచ్చారని పేర్కొంది.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వీరిలో 210 చైనీయులు కాగా, 98 మంది అమెరికన్లు.

బీజింగ్

'ప్రపంచంలో ఎక్కువ మంది ధనవంతులున్న నగరం బీజింగ్'

తాజా ఫోర్బ్స్ ధనవంతుల జాబితా ప్రకారం ఇప్పుడు ప్రపంచంలో ఏ నగరంలో లేనంత ఎక్కువ మంది కోటీశ్వరులు బీజింగ్‌లో ఉన్నారు.

గత ఏడాది బీజింగ్‌ నుంచి 33 మంది కోటీశ్వరులు ఈ జాబితాలో చేరగా ఈ ఏడాది 100మంది చోటు దక్కించుకున్నారని ఫోర్బ్స్ మ్యాగజీన్ తెలిపింది.

గత ఏడేళ్లుగా అగ్రస్థానంలో ఉన్న న్యూయార్క్ సిటీని కూడా బీజింగ్ ఈసారి వెనక్కి నెట్టేసింది.

న్యూయార్క్ సిటీ నుంచి 99 మంది ఈ ధనవంతుల జాబితాలో స్థానం సంపాదించుకున్నారు.

కోవిడ్-19తో సత్వర పోరాటం, సాంకేతిక సంస్థలు, స్టాక్ మార్కెట్ల ఎదుగుదల కారణంగా చైనాలో ధనవంతుల సంఖ్య పెరిగింది.

అయితే, న్యూయార్క్ సిటీ కన్నా ఎక్కువమంది ధనవంతులు బీజింగ్‌లో ఉన్నప్పటికీ ఉమ్మడి నికర విలువలో (80 బిలియన్ యూఎస్ డాలర్లు) న్యూయార్క్ సిటీలోని ధనవంతులదే పైచేయిగా ఉంది.

టిక్‌టాక్ వ్యవస్థాపకులు, దాని మాతృ సంస్థ బైట్‌డాన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాంగ్ యిమింగ్ ప్రస్తుతం బీజింగ్ ధనవంతుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు.

జాంగ్ యిమింగ్ నికర ఆస్తి విలువ రెట్టింపు అయి 35.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

న్యూయార్క్‌లో అత్యంత ధనవంతుడిగా మాజీ మేయర్ మైఖేల్ బ్లూంబర్గ్ నిలిచారు.

ఆయన 59 బిలియన్ డాలర్ల సంపదతో అగ్రస్థానంలో ఉన్నారు.

అమెజాన్ జెఫ్

తొలి రెండుస్థానాల్లో జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్‌

అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్ ప్రపంచంలోకెల్లా అత్యంత ధనికుడిగా నాలుగోసారి అగ్రస్థానంలో నిలిచారు.

ఆయన సంపద నికర విలువ 177 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా.

బెజోస్ ఆస్తి గత ఏడాది 64 బిలియన్ డాలర్లు పెరిగి, 177 బిలియన్ డాలర్లకు చేరింది.

ఈ జాబితాలో రెండో స్థానంలో ఎలాన్ మస్క్ నిలిచారు.

2020లో 31వ స్థానంలో ఉన్న ఎలాన్ మస్క్ 2021కల్లా రెండో స్థానానికి దూసుకొచ్చారు.

24.6 బిలియన్ డాలర్లతో గత ఏడాది ఎలాన్ మస్క్ ఫోర్బ్స్ జాబితాలో చేరారు.

ఈ ఏడాది 151 బిలియన్ డాలర్లతో ఆయన రెండో స్థానానికి దూసుకెళ్లారు.

"ఎలాన్ మస్క్ ఎలక్ట్రిక్ వాహన సంస్థ టెస్లా షేర్లు 705% పెరగడమే ఇందుకు ప్రధాన కారణం" అని ఫోర్బ్స్ ఎడిటర్ తెలిపారు.

ఫ్రెంచ్ దేశస్థుడైన బెర్నార్డ్ ఆర్నాల్ట్ 3వ స్థానంలో, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్, ఫేస్‌బుక్ సృష్టికర్త మార్క్ జూకర్‌బర్గ్ వరుసగా తరువాతి స్థానాల్లో నిలిచారు.

ఫోర్బ్స్ ధనవంతుల జాబితా

ప్రపంచ కుబేరుల జాబితాలో మహిళలూ ఉన్నారు

ప్రపంచ ధనవంతుల జాబితాలో 17వ స్థానంలో తొలి మహిళ పేరు కనిపిస్తోంది. ఆమె వాల్‌మార్ట్ వ్యవస్థాపకుడి ఏకైక కుమార్తె ఏలిస్ వాల్టన్.

ఆ తరువాత 22వ స్థానంలో మెకంజీ స్కాట్ నిలిచారు. ఈమె ఒక రచయిత. జెఫ్ బెజోస్ మాజీ భార్య.

అమెరికన్ రియాలిటీ టీవీ స్టార్ కిమ్ కర్డాషియన్ వెస్ట్ తొలిసారిగా ప్రపంచ ధనవంతుల జాబితాలో చోటు దక్కించుకున్నారు.

గత అక్టోబర్‌లో ఆమె ఆస్తి విలువ 780 మిలియన్ డాలర్ల నుంచి 1 బిలియన్ డాలర్లకు చేరింది.

భారతదేశంలో ధనవంతులు

భారతదేశం నుంచి 140 మంది కోటీశ్వరులు ప్రపంచ ధనవంతుల జాబితాలో చోటు దక్కించుకున్నారు.

ఆసియా పసిఫిక్ నుంచి 1,149 బిలియనీర్లు.. 4.7 ట్రిలియన్ డాలర్ల నికర విలువతో అమెరికన్ బిలియనీర్ల (4.6 ట్రిలియన్ డాలర్లు) కన్నా ముందున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Forbes rich list: New billionaire every 17 hours, Beijing rich
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X