ప్రధాని మోడీని చంపేందుకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిన మాజీమంత్రి అరెస్ట్
భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేసి మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ మంత్రి రాజా పటేరియా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ప్రధాని మోడీ ని లక్ష్యంగా చేసుకొని తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆయన రాజ్యాంగాన్ని కాపాడాలంటే ప్రధాని మోడీని చంపేందుకు సిద్ధంగా ఉండాలంటూ కాంగ్రెస్ నేత షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.ఈ క్రమంలో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.
పన్నా జిల్లా పోవై లో తాజాగా కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలను మతం, కులం, భాషా ప్రాతిపదికన విడదీస్తున్నారని ఆయన ఆరోపించారు. దళితులు, గిరిజనులు, మైనారిటీల జీవితాలు ప్రధాని నరేంద్ర మోడీ కారణంగా ప్రమాదంలో పడ్డాయని రాజా పటేరియా పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రధాని మోడీ కారణంగా దేశంలో సరిగ్గా అమలు జరగటం లేదన్నారు. రాజ్యాంగాన్ని కాపాడాలి అంటే మోడీని చంపడం కోసం కార్యకర్తలు సిద్ధం కావాలని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇక ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యలు దుమారంగా మారగా, ప్రధాని నరేంద్ర మోడీ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు పై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ప్రధానిని చంపాలని బాహాటంగా కార్యకర్తలను రెచ్చగొడుతున్న కాంగ్రెస్ నాయకుడిపై కేసు పెట్టి కఠిన చర్యలకు ఉపక్రమించాలని బీజేపీ నాయకులు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు.
దీంతో స్పందించిన ఆ రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా రాజా పటేరియాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. దీంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఆయనపై ఐపీసీ 451, 504, 505 (1) (బి), 505 (1) (సి), 506, 153- బి (1) (సి) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు .ఈ క్రమంలోనే తెల్లవారు జామున దామో జిల్లా హట్టాలోని ఆయన నివాసం నుంచి, ఆయనను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.












Click it and Unblock the Notifications