Girl: కాలేజ్ అమ్మాయికి ఇద్దరు ఫ్రెండ్స్, ఒకడు ఏం చేశాడంటే, చూసి తట్టుకోలేక ? !
బెంగళూరు/ కలబురిగి: కాలేజ్ లో అమ్మాయిలు, అబ్బాయిలు చదువుకుంటున్నారు. ప్రతిరోజు కాలేజ్ కు వెళ్లి వస్తున్న అమ్మాయిలు, అబ్బాయిలకు పరిచయం ఉంది. ఇదే సందర్బంలో సాటి కాలేజ్ అమ్మాయితో ఓ యువకుడు చాలా చనువుగా ఉంటున్నాడు. ఇదే విషయంలో రగిలిపోయిన మరో యువకుడు సాటి స్నేహితుడిని కత్తితో దారుణంగా పొడిచేయడంతో అతని ఆసుపత్రిలో చావుబతుల మద్య పోరాడుతున్నాడు. కాలేజ్ అమ్మాయి విషయంలో కాలేజ్ అబ్బాయిని అదే కాలేజ్ అబ్బాయి కత్తితో పొడిచి చంపేయాడానికి ప్రయత్నించడం కలబురిగిలో కలకలం రేపింది.

కాలేజ్ అబ్బాయి
కర్ణాటకలోని కలబురిగిలో మోహమ్మద్ అత్తేషమాన్ అలియాస్ మోహమ్మద్ (19) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. మోహమ్మద్ నర్సింగ్ కాలేజ్ లో చదువుకుంటున్నాడు. అదే కాలేజ్ లో చదువుతున్న ఓ అమ్మాయితో మోహమ్మద్ కు పరిచయం అయ్యింది. కొంతకాలం తరువాత ఇద్దరు చాలా క్లోజ్ అయ్యారు.

కాలేజ్ అమ్మాయితో క్లోజ్
కొంతకాం తరువాత మోహమ్మద్, అదే కాలేజ్ లో చదువుకుంటున్న యువతి ప్రతిరోజు ఫోన్ లో మాట్లాడుకుంటూ వాట్సాప్ లో చాటింగ్ చేసుకుంటున్నారు. రానురాను కాలేజ్ అమ్మాయి, నర్సింగ్ కాలేజ్ లోనే చదువుకుంటున్న మోహమ్మద్ దగ్గర అయ్యారు. ఇదే కాలేజ్ లో చదువుతున్న మఝమిల్ అనే యువకుడు వీరి స్నేహాన్ని సహించలేకపోయాడు.

అమ్మాయి కోసం ఫ్రెండ్స్ ?
విచిత్రం ఏమిటంటే మోహమ్మద్, మఝుమిల్ ఇద్దరూ స్నేహితులు. కాలేజ్ అమ్మాయికి కూడా మజుమిల్ స్నేహితుడు. నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడకూడదని ఆమె బాయ్ ఫ్రెండ్ మోహమ్మద్ కు మిఝమిల్ వార్నింగ్ ఇచ్చాడు. అయితే మోహమ్మద్ మాత్రం ఆ అమ్మాయితో నిత్యం టచ్ లోనే ఉన్నాడు. ఇదే విషయం జీర్ణించుకోలేని మఝమిల్ కత్తి తీసుకుని సాటి కాలేజ్ అబ్బాయి మోహమ్మద్ ను ఇష్టం వచ్చినట్లు పొడిచేశాడు.

ఐసీయూలో కాలేజ్ అబ్బాయి
తీవ్రగాయాలైన మోహమ్మద్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడని, అతని పరిస్థితి వియమంగా ఉందని కలబురిగి పోలీసులు అన్నారు. కాలేజ్ అమ్మాయి విషయంలో కాలేజ్ అబ్బాయి మోహమ్మద్ ను అదే కాలేజ్ లో చదువుతున్న అతని స్నేహితుడు మఝమిల్ కత్తితో పొడిచి చంపేయాడానికి ప్రయత్నించడం కలబురిగిలో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications