వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గూగుల్, జీ మెయిల్, యూ ట్యూబ్ డౌన్: 10 నుంచి 15 నిమిషాలు..యూజర్ల విల విల.

|
Google Oneindia TeluguNews

గూగుల్, జీ మెయిల్, యూ ట్యూబ్‌కు అంతరాయం కలిగింది. సోమవారం సాయంత్రం డౌన్ కావడంతో యూజర్లు ఇబ్బంది పడ్డారు. మెయిల్ రాసే సమయం/ వెతికే సమయంలో గూగుల్ సెర్చ్, డ్రైవ్ కూడా పనిచేయలేదు. 10-15 నిమిషాల పాటు గూగుల్ స్తంభించిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా 40 వేల క్లైయింట్స్‌కు ఇబ్బంది కలిగిందని డౌన్ డెక్టర్ తెలిపింది. ఇవాళ సోమవారం వీక్ స్టార్ట్ అయిన రోజే సేవలకు అంతరాయం కలిగింది. ఈ విషయాన్ని చాలా మంది ట్వీట్ చేశారు.

సాయంత్రం 5 గంటలకు సమస్య ప్రారంభమైంది. యూ ట్యూబ్ హోం పైన కోతి బొమ్మ కనిపించింది. దీంతో సమస్య స్టార్ట్ అయ్యింది. 10 నుంచి 15 నిమిషాల పాటు సర్వర్ డౌన్ కావడంతో ప్రపంచం స్తంభించిపోయింది. అయితే సమస్య గురించి గూగుల్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే యూ ట్యూబ్ మాత్రం ట్వీట్ చేసింది. యూ ట్యూబ్ డౌన్ సమస్య ఉన్నదని.. దానిని తమ టెక్నికల్ టీం పరిశీలిస్తున్నారని పేర్కొన్నది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌‌డేట్ చేస్తామని తెలిపింది.

Google, Gmail, YouTube down in massive outage worldwide

గూగుల్ సేవలకు అంతరాయం కలుగడంతో బ్రౌజర్లు.. మైక్రోసాప్ట్ ఎడ్జ్, ఫైర్ ఫాక్స్ బ్రౌజ్ చేశారు. 15 నిమిషాల తర్వాత గూగుల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే అప్పుడప్పుడు ఇంటర్నల్ సాప్ట్ వేర్ అప్ డేట్ చేసే సమయంలో ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కానీ సైబర్ థ్రెట్ ఉండటంతో యూజర్లు ఆందోళన చెందారు. కానీ డేటాకు డోకా లేదని వారు స్పష్టం చేస్తున్నారు.

English summary
Google services abruptly went down on Monday evening, impacting hundreds of users. Gmail, Google Search, YouTube, and Drive among others.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X