ఆన్‌లైన్ షాపింగ్‌పై కన్నేసిన కేంద్రం: పరిగణలోకి ఈ-ఖర్చులు కూడా

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఇక ఆన్‌లైన్ షాపింగ్‌పైనా కేంద్రం కన్నేసింది. వచ్చే నెల నుంచి ఈ కామర్స్ ఖర్చులపై కేంద్రం ఆరా తీయనుంది. నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ ఇక నుంచి దేశ వ్యాప్తంగా ప్రజల ఆన్‌లైన్ షాపింగ్ ఖర్చులను కూడా పరిగణలోకి తీసుకోనుంది.

వచ్చే జులై నుంచి 2018 జూన్ వరకు ఈ-ఖర్చులను కూడా గణాంక మంత్రిత్వ శాఖ తమ పరిధిలోకి తీసుకోనుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలు ఆన్‌లైన్ ద్వారా షాపింగ్ చేస్తున్న వస్తువుల వివరాలను సేకరించనుంది.

Government to start mapping your online shopping habits

జాతీయ ఆర్థిక దత్తాంశంలో భాగంగానే ఈ సేకరణ జరుగుతోందని ఇప్పటికే ఈ పనిలో నిమగ్నమైన కొందరు అధికారులు చెబుతున్నారు. 2016లో ఈకామర్స్ రంగం సుమారు 14.5బిలియన్ డాలర్ల లావాదేవీలు జరిగినట్లు రెడ్ సీర్ కన్సల్టెంగ్ పేర్కొంది. కాగా, దేశ మొత్తం ఖర్చు(750డాలర్ల)లో ఇది చాలా చిన్న మొత్తమే. అయితే, ఇది ముందు ముందు భారీగా పెరిగే అవకాశం ఉంది.

ఆసియా పసిపిక్ ప్రాంతంలో 2021 వరకు ఒకటిలో ఐదో వంతుకు చేరుకుంటుందని అమెరికాకు చెందిన మార్కెట్ రీసెర్చ్ కంపెనీ ఫోరెస్టర్ అంచనా వేస్తోంది. ఇప్పటి వరకు చైనానే ఆన్ లైన్ షాపింగ్ మార్కట్లో ముందుందని, ఇప్పుడు ఇండియా కూడా వేగంగా ఈ రంగంలో అభివృద్ధిని నమోదు చేస్తోందని తెలిపింది. కాగా, దేశంలోని 5వేల పట్టణాలు, 7వేల గ్రామాల్లోని 1.2లక్షల కుటుంబాలను సర్వే పరగణిలోకి తీసుకోనుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Shop online? The government of India (GoI) wants to know the details. Starting next month, government surveys on expenditure will, for the first time, ask questions on ecommerce spending habits.
Please Wait while comments are loading...