Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎన్‌ఆర్‌ఐ భర్తల బాధితుల కోసం త్వరలో వెబ్ పోర్టల్

ఎన్నారై భర్తల చేతిలో మోసపోయిన బాధిత భార్యలకు సహాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలో ఒక వెబ్ పోర్టల్ ను ప్రారంభించనుంది. ఈ పోర్టల్ లో అడ్వకేట్లు, స్వచ్ఛంద సంస్థలు తదితర సమాచారం ఉంటుంది.

న్యూఢిల్లీ: ఎన్నారై భర్తల చేతిలో మోసపోయిన బాధిత భార్యలకు సహాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలో ఒక వెబ్ పోర్టల్ ను ప్రారంభించనుంది. ఈ పోర్టల్ లో అడ్వకేట్లు, స్వచ్ఛంద సంస్థలు తదితర సమాచారం ఉంటుంది. ఈ పోర్టల్ ను భారత విదేశాంగ శాఖ నిర్వహించనుంది.

గత వారం జరిగిన ప్రత్యేక కమిటీ సమావేశంలో ఈ మేరకు ఒక వెబ్ పోర్టల్ ను తీసుకురావాలని నిర్ణయించారు. ఈ కమిటీలో మహిళా, శిశు సంక్షేమ శాఖ, విదేశాంగ శాఖ, హోం మంత్రిత్వ శాఖల నుంచి ఒక్కరేసి చొప్పున అధికారులున్నారు.

Govt to launch a web portal to assist brides abandoned by NRIs

విదేశాల్లో భర్త వదిలేసినా, స్వదేశంలో మోసానికి గురై విడాకులు పొందడంలో సమస్యలు ఎదుర్కొంటున్నా, మనోవర్తి పొందాలనుకునే బాధిత మహిళలకు కేంద్రం తీసుకురానున్న ఈ వెబ్ పోర్టల్ సహాయకారిగా ఉంటుంది.

ఎన్నారై భర్తల గురించి పలు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో గత ఏడాది ఏర్పాటైన ఈ కమిటీ.. బాధితులకు అభివృద్ధి చెందిన దేశాల్లో 3 వేల డాలర్లు, వర్థమాన దేశాల్లో 2 వేల డాలర్లు ఆర్థిక సాయం చేయాలని ఇప్పటికే ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+