చర్యకు ప్రతి చర్య: చూస్తూ ఊరుకోబోమన్న రాజ్‌నాథ్ సింగ్, ధీటుగా తిప్పికొడతామని..

తూర్పు లడాఖ్ సరిహద్దు వద్ద చైనా దుందుకుడు చర్యలపై భారత్ అదేస్థాయిలో స్పందించింది. నిన్న మాస్కోలో షాంఘై సహకార సదస్సులో చైనా రక్షణమంత్రి వి పెంగీతో రాజ్‌నాథ్ సమావేశమైన సంగతి తెలిసిందే. సమావేశానికి సంబంధించి తొలిసారి కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. ఓ వైపు చర్చలు జరుపుతున్న చైనా.. మరోవైపు సరిహద్దుల్లో బలగాలను మొహరిస్తోంది. దీంతో రాజ్‌నాథ్ గట్టిగా బదులిచ్చారు. మీరు దుందుకుడుగా వ్యవహరిస్తే.. మేం చూస్తూ ఊరుకుంటామని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు.

దేశ సార్వభౌమత్వానికి, ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగిస్తే.. అదేరీతిగా స్పందిస్తామని రాజ్‌నాథ్ స్పష్టంచేశారు. ప్ర‌తిగా ఎలాంటి చర్యకైనా వెనకడుగు వేసేది లేదనిస్ప‌ష్టం చేశారు. గల్వాన్‌ లోయతోపాటు వాస్తవాధీన రేఖ వెంట పలు ప్రాంతాల్లో ఇటీవల చోటుచేసుకున్న‌ పరిణామాలపై రాజ్‌నాథ్‌ సింగ్ తన వాణి గట్టిగా వినిపించారు.

Have No Doubt...: India Warns China Against

చైనా దళాలను మోహరిస్తూ దుందుడుకు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌డం సహేతుకం కాదు.. స‌రిహ‌ద్దుల వ‌ద్ద‌ యథాతథ పరిస్థితిని కొనసాగించాలనే ఒప్పందాన్ని డ్రాగ‌న్ ఉల్లంఘిస్తోంద‌ని రాజ్‌నాథ్ సింగ్ గుర్తుచేశారు. సరిహద్దు భద్రత విషయంలో భారత సైన్యం మాత్రం బాధ్యతగా వ్యవహరిస్తోందని గుర్తు చేశారు. త‌మ‌ భద్రతా బలగాలను నియంత్రించే వ్యవస్థను చైనా మరింత పటిష్ఠం చేయాలని సూచించారు. శాంతి, సుస్థిరత కోసం చైనా సహకారం కావాలని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టంచేశారు. అదే సమయంలో దుందుకుడుగా వ్యవహరిస్తే.. మేం కూడా అదే రీతిలో స్పందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+