హత్య కేసుల్లో డేరా భవితవ్యంపై తీర్పు వాయిదా, హనీప్రీత్‌ను అక్కడే దాచారా?

Subscribe to Oneindia Telugu

సిర్సా: జర్నలిస్టు రామచంద్ర ఛత్రపతి, డేరా మాజీ మేనేజర్ రంజిత్ సింగ్ హత్య కేసులపై విచారణను పంచకుల సీబీఐ కోర్టు వాయిదా వేసింది. కేసులో కీలక సాక్షిగా భావిస్తున్న గుర్మీత్ బాబా మాజీ డ్రైవర్ కట్టా సింగ్ వాంగ్మూలాన్ని పరిగణలోకి తీసుకోవాలా? వద్దా? అన్న పిటిషన్ పై సెప్టెంబర్ 22వ తేదీన నిర్ణయం తీసుకుంటామని న్యాయమూర్తి జగ్దీప్ సింగ్ అన్నారు.

సంపన్న మహిళలను రప్పించి!: అంతమందితో ఒక్కడే, డేరా బాబా 'రూబరూ' పార్టీ

కట్టా సింగ్ తరుపు న్యాయవాది కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించారు. కాగా, డేరా ఆశ్రమంలో సాగుతున్న అక్రమాలు, రాసలీలలను వెలుగులోకి తెచ్చుకున్నారన్న కారణంతోనే రామచంద్ర ఛత్రపతి, రంజిత్ సింగ్ లను డేరా బాబా హత్య చేశాడన్న ఆరోపణలున్నాయి. 2002లో జరిగిన ఈ హత్యలకు సంబంధించి పంచకుల సీబీఐ న్యాయస్థానంలో శనివారం తుది వాదనలు జరిగాయి.

Hearing in 2 murder cases against Dera chief Ram Rahim
  Gurmeet Ram Rahim Singh : సంపన్న మహిళలను రప్పించి!: అంతమందితో ఒక్కడే | Oneindia Telugu

  కేసులో ఆరుగురు నిందితులు కోర్టుకు హాజరుకాగా, గుర్మీత్ సింగ్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించారు. అనువాదకుడి సహాయం తీసుకుంటారా? అని కోర్టు డేరా బాబాను కోరగా.. అవసరం లేదని బదులిచ్చాడు.

  ఇదిలా ఉంటే, గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ నుంచి ప్రాణ హాని ఉందనే భయంతో గతంలో తప్పుడు వాంగ్మూలం ఇచ్చానని, కోర్టు అనుమతిస్తే ఇప్పుడు అసలు నిజాలను చెబుతానని కట్టా సింగ్ చెబుతున్నాడు. స్వయంగా కోర్టుకు వచ్చేందుకు కూడా తాను సిద్దంగా ఉన్నట్లు తెలిపాడు.

  ఇక డేరా బాబా దత్తపుత్రిక, ఆయనకు అత్యంత సన్నిహితురాలైన హనీప్రీత్ సింగ్ దేశంలోనే ఎక్కడో తలదాచుకుని ఉంటారని కట్టా సింగ్ అనుమానం వ్యక్తం చేశాడు.శవ్యాప్తంగా గుర్మీత్‌కి చెందిన అన్ని డేరా ఆశ్రమాల్లోనూ ప్రభుత్వం సోదాలు జరపాలన్నారు.

  ఇప్పటికే హనీప్రీత్ కు లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు.. ఆమె డ్రైవర్ ను రాజస్థాన్ లో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. గుర్మీత్‌ను సీబీఐ కోర్టు దోషిగా తేల్చిన అనంతరం బాబాను తప్పించేందుకు ఆమె ప్లాన్ వేసినట్లుగా ఆరోపణలున్నాయి. సాధ్వీలపై అత్యాచారం కేసులో తీర్పు సందర్భంగా చోటు చేసుకున్న అల్లర్లను దృష్టిలో ఉంచుకుని పంచకులలో 5బెటాలియన్లతో భద్రతను ఏర్పాటు చేశారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  The hearing in two separate murder cases against Dera Sacha Sauda chief Gurmeet Ram Rahim Singh and others began here on Saturday in a special CBI court amid tight security.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి