వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శుభవార్త: ఆధార్ దుర్వినియోగానికి చెక్, ఆన్‌లైన్ డేటా తెలుసుకోండిలా..

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆధార్‌తో సంబంధం లేకుండా ఏ పని జరగని పరిస్థితి నెలకొంది. అయితే ఆధార్‌ను కొందరు దుర్వినియోగం చేస్తారనే అనుమానాలు కూడ లేకపోలేదు. అయితే ఆధార్‌ విషయమై కోర్టును కూడ ఆశ్రయించారు.

ఆధార్‌ను సంక్షేమ పథకాలకు అనుసంధానం చేయాలని ప్రభుత్వాలు తప్పనిసరి చేస్తున్నాయి. అయితే బోగస్ లబ్దిదారులకు సంక్షేమ పథకాలు చేరకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఆధార్‌ లింకేజ్ చేయాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయని ప్రభుత్వాలు చెబుతున్నాయి.

ఆధార్‌పై వచ్చే ఏడాది మార్చి వరకు గడువు విధిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు నివేదించింది. అయితే ఆధార్ దుర్వినియోగం అయిందో లేదో తెలుసుకొనే వెసులుబాటును కూడ కల్పించింది యూఐడిఏఐ.

ఆధార్ దుర్వినియోగం అయిందో లేదో తెలుసుకొండిలా

ఆధార్ దుర్వినియోగం అయిందో లేదో తెలుసుకొండిలా

ఆధార్ కార్డ్ దుర్వినియోగం అయిందో లేదో తెలుసుకొనే వెసులుబాటును కూడ యూఐడిఏఐ ప్రకటించింది. మనకు తెలియకుండానే ఇతరులెవ్వరైనా ఆధార్‌ను దుర్వినియోగం చేస్తే సులభంగా తెలుసుకొనే వెసులుబాటు కల్గింది. ఈ వెసులుబాటు ఆధారంగా ఎక్కడ ఆధార్ దుర్వినియోగమైందో సులభంగా గుర్తించి ఫిర్యాదు చేయవచ్చని యూఐడిఏఐ ప్రకటించింది.

మీ ఆధార్‌ను ఎక్కడ వాడారో తెలుసుకోవచ్చు

మీ ఆధార్‌ను ఎక్కడ వాడారో తెలుసుకోవచ్చు

యూఐడీఏఐ ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ పేజీకి వెళ్లాలి (https://resident.uidai.gov.in/notification-aadhaar)ఈ హిస్టరీ పేజీలో మన ఆధార్ నెంబర్‌ను ఎన్ని దఫాలు , ఎక్కడెక్కడ ఉపయోగించారో తెలుసుకొనే అవకాశం ఉంటుంది.అయితే దీన్ని తెలుసుకొనేందుకు చిన్న పద్దతులను ఉపయోగిస్తే సరిపోతోంది.

ఫోన్ నెంబర్‌కు సమాచారం

ఫోన్ నెంబర్‌కు సమాచారం

యూఐడిఏఐ హిస్టరీ పేజీలో ఆధార్ నంబర్‌తో పాటు అక్కడ ఉన్న నెంబర్లను ఎంటర్ (కాప్చా కోడ్) చేయాలి.వెంటనే మొబైల్ నెంబర్‌కు వన్ టైమ్ పాస్‌వర్డ్ వస్తోంది.ఓటిపిని ఎంటర్ చేస్తే తర్వాతి పేజీలోకి సులభంగా చేరవచ్చు.

6 నెలల సమాచారం

6 నెలల సమాచారం

ఈ పేజీలో 6 మాసాల సమాచారం లభ్యమౌతోంది. ఏ రకమైన సమాచారం కావాలో ఆఫ్షన్లు కన్పిస్తున్నాయి. మనకు కావాల్సిన ఆఫ్షన్లపై నొక్కి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఏ రోజు, ఏ సమయానికి, ఎలాంటి పని కోసం ఆధార్‌ను ఇచ్చారన్న వివరాలు వస్తాయి. అయితే ఇందులో మీ ఆధార్ వాడిన కంపెనీ లేదా ఏజెన్సీ పేర్లు మాత్రం చూపించదు.

English summary
you can also lock Aadhaar biometric data online. You can also check when your Aadhaar data was used for authentication. Just follow these steps.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X