IAS: బెంగళూరు కలెక్టర్ ఇంటిలో సోదాలు, ఇప్పటికే అరెస్టు, ఉద్యోగి దెబ్బతో ఐఏఎస్ పరిస్థితి !
బెంగళూరు: బెంగళూరు జిల్లా కలెక్టర్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేసి జైలుకు పంపించడం కలకలం రేపింది. భూమి వివాదానికి సంబంధించి సెటిల్ మెంట్ చెయ్యడానికి రూ. 5 లక్షలు లంచం తీసుకుంటూ జిల్లా కలెక్టర్ మంజునాథ్ ను, ఆ కార్యాలయం సిబ్బందిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఇప్పుడు బెంగళూరు కలెక్టర్ కు చెందిన అపార్టె మెంట్ లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు.
బెంగళూరులో నివాసం ఉంటున్న వ్యక్తికి బెంగళూరు గ్రామీణ జిల్లాలోని ఆనేకల్ సమీపంలోని కూడ్లు గ్రామంలో 38 గుంటల భూమి ఉంది. ఈ భూమి వివాదం బెంగళూరు జిల్లా న్యాయాలయంలో విచారణ జరుగుతోంది. ఈ వివాదం పరిష్కరించడానికి బెంగళూరు జిల్లాధికారి కార్యాలయంలో డిప్యూటీ తహసిల్దార్ (మేనేజర్)గా పని చేస్తున్న మహేష్ రూ. 15 లక్షలు లంచం డిమాండ్ చేశారని ఆరోపణలు ఉన్నాయి.

ఇరు వర్గాలు చర్చలు జరగడంతో రూ. 5 లక్షలు లంచం ఇవ్వడానికి డీల్ కుదిరింది. బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చారు. బెంగళూరు జిల్లాధికారి కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్న మహేష్ బాధితురడి నుంచి రూ. 5 లక్షలు లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు ఆయన సిబ్బంది వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
బెంగళూరు జిల్లాధికారి మంజునాథ్ సూచనమేరకు మేము రూ. 5 లక్షలు లంచం తీసుకున్నామని మంజునాథ్ ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చారు. బెంగళూరు జిల్లాధికారి మంజునాథ్ లంచం తీసుకోవాలని చెప్పారని వివచారణలో వెలుగు చూడటంతో ఆయన్ను అరెస్టు చెయ్యడం కలకలం రేపింది. బెంగళూరు జిల్లా కలెక్టర్ మంజునాథ్ కు చెందిన యశవంతపురంలోని ఆయన అపార్ట్ మెంట్ లో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు కీలకమై పత్రాలు స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారని ఓ సీనియర్ అధికారి తెలిపారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications