Wife: నువ్వు ఎంజాయ్ చెయ్యడానికి నా భార్య కావాలా ?, నువ్వు అంత మగాడివా రా ?, ఇద్దరూ క్రిమినల్స్!
పెళ్లికి వెళ్లిన యువకుడు అర్దరాత్రి బైక్ లో ఇంటికి బయలుదేరాడు. మార్గం మద్యలో ముగ్గురు వ్యక్తులు అతన్ని అడ్డగించారు. ఇద్దరి మద్య మాటల యుద్దం జరిగింది. నువ్వు ఎంజాయ్ చెయ్యడానికి నా భార్య కావాలా రా
న్యూఢిల్లీ: ఒకే ప్రాంతంలో కొందరు యువకులు నివాసం ఉంటున్నారు. యువకులు క్రిమినల్ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఇద్దరు యువకుల మద్య వ్యవహారం చెడింది. కొంతకాలంగా ఓ యువకుడిని చూస్తే మరో యువకుడు మండిపడుతున్నాడు. పెళ్లికి వెళ్లిన యువకుడు అతని స్నేహితుడితో కలిసి అర్దరాత్రి బైక్ లో ఇంటికి బయలుదేరాడు.
మార్గం మద్యలో ముగ్గురు వ్యక్తులు కల్యాణమండపం నుంచి బయలుదేరి ఇంటి వెలుతున్న వారిని అడ్డగించారు. తరువాత ఇద్దరి మద్య మాటల యుద్దం జరిగింది. ఆ సందర్బంలో ఓ యువకుడు మరో యువకుడిని కత్తితో పొడిచాడు. నువ్వు ఎంజాయ్ చెయ్యడానికి నా భార్య కావాలా రా ?, నువ్వు అంత మగాడివా అంటు చితకబాదేశారు. దెబ్బకు ఆ యువకుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

పెళ్లికి వెళ్లిన యువకుడు
ఢిల్లీలోని నీలమ్ వాలా ప్రాంతంలో జతిన్ (24) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. జతిన్ స్నేహితుడి పెళ్లి నబీ కరీమ్ ప్రాంతంలోని ఓ కల్యాణ మండపంలో జరిగింది. జతిన్ మరో స్నేహితుడితో కలిసి పెళ్లికి వెళ్లాడు. రాత్రి 8 గంటల నుంచి అర్దరాత్రి 1 గంట వరకు జతిన్ అతని స్నేహితులతో కలిసి పెళ్లిలో ఎంజాయ్ చేశారు. అందరూ యవకులు హ్యాపీగా పెళ్లిలో సందడి చేశారు.

అర్దరాత్రి బయలుదేరాడు
అర్దరాత్రి 1 గంట కు జతిన్ నేను ఇంటికి వెళ్లి ఉదయం పెళ్లికి వస్తానని ఫ్రెండ్స్ కు చెప్పి అక్కడి నుంచి బయలుదేరారు. జతిన్ అతని బైక్ లో మరో స్నేహితుడితో కలిసి ఇంటికి బయలుదేరాడు. మార్గం మధ్యలో నబీ కరీం ప్రాంతం సమీపంలోని చినోత్ భవన్ దగ్గర ముగ్గురు వ్యక్తులు యాక్టీవా స్కూటర్ లో వెళ్లి జతిన్ ను అడ్డగించారు. జతిన్ ను అడ్డగించిన సౌరభ్, రజనీకాంత్, అక్షయ్ అతనితో గొడవ పెట్టుకున్నారు.

నీకు నా పెళ్లామ్ కావాలా ?, నువ్వు అంత మగాడివా రా
జతిన్ తో సౌరబ్ గొడవపెట్టుకున్నాడు. తరువాత జతిన్, సౌరబ్ ల మద్య మాటల యుద్దం జరిగింది. ఆ సందర్బంలో సౌరబ్ కత్తితో జతిన్ ను పొడిచాడు. నువ్వు ఎంజాయ్ చెయ్యడానికి నా భార్య కావాలా రా ?, నువ్వు అంత మగాడివా అంటూ జతిన్ ను సౌరబ్ అతని స్నేహితులు చితకబాదేసి అక్కడి నుంచి పరారైరు.
కడుపులో కత్తిపోటు పడటంతో జతిన్ అక్కడే కుప్పకూలిపోయాడు. జతిన్ తల్లికి ఫోన్ చేసి మ్యాటర్ చెప్పిన అతని స్నేహితుడు భయంతో పరారైనాడు.

ఆసుపత్రిలో ప్రాణం పోయింది
జతిన్ తల్లి చినోత్ భవన్ దగ్గరకు పరుగు తీసింది. చినోత్ నగర్ ఆరవ వీధిలో రోడ్డు పక్కన జతిన్ చలనం లేకుండా పడిఉండటంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై జతిన్ చనిపోయాడని ఢిల్లీ సెంట్రల్ డీసీపీ శ్వేతా చౌహాన్ మీడియాకు చెప్పారు. జతిన్ తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
జతిన్ మీద దాడి చేసిన ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీటీవీలను పరిశీలించామని, జతిన్ తో పాటు పెళ్లికి వెళ్లిన వ్యక్తిని విచారణ చేసి వివరాలు సేకరించామని ఢిల్లీ సెంట్రల్ డీసీపీ శ్వేతా చౌహాన్ అన్నారు.

ఫ్రెండ్ భార్యతో అక్రమ సంబంధం
పోలీసులు జతిన్ హత్య కేసులో సౌరబ్ ను అరెస్టు చేశారు. సౌరబ్ కు రూపాలి (పేరు మార్చడం జరిగింది) అనే యువతితో వివాహం అయ్యిందని పోలీసులు అన్నారు. గతంలో సౌరబ్, జతిన్ స్నేహితులు. సౌరబ్ ఇంటికి వెళ్లి వస్తున్న జతిన్ అతని భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమెతో ఎంజాయ్ చేశాడని, చాలాకాలం పాటు ఇద్దరు సీక్రేట్ గా కలుసుకునే వారని పోలీసులు అన్నారు.

చాలా రోజుల నుంచి స్కెచ్ వేసిన సౌరబ్
కొంతకాలం తరువాత సౌరబ్ కు అతని భార్య, జతిన్ ల అక్రమ సంబంధం గురించి తెలిసిపోవడంతో ఇద్దరు విడిపోయారని పోలీసులు అన్నారు. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న జతిన్ ను హత్య చెయ్యాలని సౌరబ్ చాలా కాలం నుంచి వేచిచూశాడని. చివరికి జతిన్ ను పొడిచి చంపేశాడని పోలీసులు అన్నారు.
రజనీకాంత్, అక్షయ్ ఇద్దరు జతిన్ ను పట్టుకుంటే సౌరబ్ కత్తితో పొడిచి చంపేశాడని ఢిల్లీ సెంట్రల్ డీసీపీ శ్వేతా చౌహాన్ తెలిపారు. జతిన్ హత్య కేసులో రజనీకాంత్, అక్షయ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మైనర్లుగా ఉన్న సమయంలోనే సౌరబ్ మీద నాలుగు క్రిమినల్ కేసులు, జతిన్ మీద మూడు క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయని, ఇద్దరూ నేరస్తులే అని పోలీసులు అంటున్నారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications