Illegal affair: భార్య రెచ్చిపోయిందని ఇంట్లోనే తల నరికేశాడు, ఎస్కేప్, చిన్నపొరపాటుతో !

అహమ్మదాబాద్/సూరత్/ ముంబాయి: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. రానురాను భార్య మీద ఆమె భర్తకు అనుమానం మొదలైయ్యింది. తన భార్యకు అక్రమ సంబంధం ఉందని, అందుకే నా జీవితంతో గేమ్స్ ఆడుతోందని భర్తకు అనుమానం మొదలైయ్యింది. ఇదే విషయంలో దంపతుల మద్య గొడవలు జరిగాయి. భార్య ప్రియుడిని పట్టుకోవడానికి ఆమె భర్త అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే భర్త ప్రయత్నాలు అన్నీ విఫలం అయ్యాయి. చివరికి భార్యను నరికి చంపేసిన భర్త ఆమె శవాన్ని ఇంట్లో పెట్టి మాయం అయ్యాడు. ఆరు నెలల నుంచి భర్త పోలీసులకు కాని, భార్య కుటుంబ సభ్యులకు కాని చిక్కలేదు. అయితే చిన్నపోరపాటుతో భార్యను దారుణంగా హత్య చేసిన భర్త పోలీసులకు చిక్కిపోయాడు.

 దంపతుల హ్యాపీలైఫ్

దంపతుల హ్యాపీలైఫ్

గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరంలోని షేలా ప్రాంతంలో హితేష్ గోహిల్ అలియాస్ హితేష్ (34) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం హితేష్ హంసా గోహిల్ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న నాలుగు సంవత్సరాలు హితేష్ గోహిల్, హంసా గోహిల్ దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు.

 భార్య మీద అనుమానం

భార్య మీద అనుమానం

రెండు సంవత్సరాల క్రితం హితేష్ కు అతని భార్య హంసా మీద అనుమానం వచ్చింది. హితేష్ బయటకు వెళ్లిన తరువాత అతని భార్య హంసా ఎక్కువగా బయట తిరిగిందని తెలిసింది. తరువాత రానురాను భార్య హంసా మీద ఆమె భర్త హితేష్ కు అనుమానం మొదలైయ్యింది. నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు అంటూ హితేష్ అతని భార్య హంసాతో గొడవపడటం మొదలుపెట్టాడు.

 భార్యకు అక్రమ సంబంధం ఉందని డౌట్

భార్యకు అక్రమ సంబంధం ఉందని డౌట్

తన భార్య హంసాకు అక్రమ సంబంధం ఉందని, అందుకే నా జీవితంతో గేమ్స్ ఆడుతోందని ఆమె భర్త హితేష్ కు అనుమానం మొదలైయ్యింది. ఇదే విషయంలో హితేష్, హంసా గోహిల్ దంపతుల మద్య గొడవలు జరిగాయి. భార్య హంసా ప్రియుడిని పట్టుకోవడానికి ఆమె భర్త హితేష్ అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే హితేష్ ప్రయత్నాలు అన్నీ విఫలం అయ్యాయి.

 భార్యను చంపేసి ఎస్కేప్

భార్యను చంపేసి ఎస్కేప్

2021 నవంబర్ 25వ తేదీన ఇంటికి వెళ్లిన హితేష్ అతని భార్య హంసాతో ఇదే విషయంలో గొడవపడ్డాడు. ఆ సందర్బంలో హితేష్, హంసా దంపతుల మద్య మాటామాటా పెరిగింది. ఆ సందర్బంలో సహనం కోల్పోయిన హితేష్ కొడవలితో అతని భార్య హంసా తల నరికి ఆమెను చంపేసి శవాన్ని ఇంట్లో పెట్టి బయట తాళం వేసుకుని పారిపోయాడు.

 ఆరు నెలలు గ్రేట్ ఎస్కేప్

ఆరు నెలలు గ్రేట్ ఎస్కేప్

భార్య హంసాను హత్య చేసిన తరువాత హితేష్ ఐదు సంవత్సరాల క్రితం పని చేసిన ముంబాయి వెళ్లిపోయి అక్కడ కూలి పనులు చేసి మూడు నెలలు కాలం గడిపేశాడు. తరువాత సూరత్ చేరుకుని అక్కడ మూడు నెలలు సెక్యూరిటీ గార్డుగా పని చేశాడు. అయితే చిన్న పని ఉందని పొరపాటున అహ్మదాబాద్ వెళ్లిన హితేష్ ను అహమ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు. భార్య హంసాను చంపేసి ఐదు నెలలు తప్పించుకుని తిరిగిన హితేష్ చివరికి చిక్కిపోయాడని అహమ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+