సక్సెస్: వర్టికల్ లాంచ్, విజయవంతంగా ప్రయోగించిన డీఆర్డీవో
డీఆర్డీవో మరో క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. మంగళవారం ఒడిశా తీరంలో గల చండీపూర్ నుంచి ఇ:టిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి స్వల్ప శ్రేణి క్షిపణిని ఉపరితరలం నుంచి గగనతలానికి ప్రయోగించారు. ఈ ప్రయోగం విజయవంతం అయ్యింది. తక్కువ ఎత్తులో ఎలక్ట్రానిక్ లక్ష్యానికి వ్యతిరేకంగా లాంచర్ ప్రయోగించామని భారత రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Recommended Video
చాందీపూర్ ఐటీఆర్ ద్వారా ట్రాకింగ్ సాధనాలను ఏర్పాటు చేశారు. సబ్ పారామీటర్స్ కూడా చక్కగా పనిచేశాయని రక్షణశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రయోగం భవిష్యత్ ఎక్స్ పరిమెంట్లకు వేదికగా నిలిచింది. ముఖ్యంగా వర్టికల్ లాంచర్ యూనిట్ విభాగానికి చక్కగా పనిచేసిందని వివరించారు. ఇండియన్ నేవీకి కూడా యూజ్ అవుతుందని తెలిపింది. ఈ ప్రయోగాన్ని డీఆర్డీవో, ఇండియన్ నేవీ సీనియర్ అధికారులు పర్యవేక్షించారు. తొలి ప్రయోగం ఈ ఏడాది ఫిబ్రవరి 22వ తేదీన జరిగింది. తర్వాత ట్రయల్ ఇవాళ నిర్వహించారు. ఇటు డీఆర్డీవో అధికారుల, ఇండియన్ నేవిని రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభినందనలు తెలియజేశారు. ఇదీ భారత రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసిందని వివరించారు.












Click it and Unblock the Notifications