స్వాతి హత్య: రామ్ కుమార్‌ను ఇరికించారా, లేదే?

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: ఇన్ఫోసిస్ టెక్కీ స్వాతి హత్య కేసులో రామ్ కుమార్‌ను ఇరికించారనేది అబద్ధమేనని అర్థమవుతోంది. తన కుమారుడిని ఇరికించారని అతని తండ్రి వాదిస్తూ వచ్చాడు. కానీ రామ్ కుమార్ పోలీసు విచారణలో వెల్లడించిన అంశాలను చూస్తే అతని తండ్రి వాదనలో నిజం లేదని తెలుస్తోంది. ప్రేమించి మోసం చేసినందువల్లే స్వాతికి గుణపాఠం చెప్పానని రామ్‌కుమార్‌ పోలీసులకి వాంగ్మూలమిచ్చాడు.

జూన్ 24న నుంగంబాక్కం రైల్వేస్టేషన్ వద్ద జరిగిన స్వాతి హత్య కేసులో నిందితుడు రామ్‌ కుమార్‌ను బుధవారం సాయంత్రం నుంచి గురువారం రాత్రి వరకు పోలీసులు విచారణ జరిపారు. ఎగ్మూరు కోర్టు ఆదేశాల మేరకు రామ్‌కుమార్‌ను మూడు రోజుల కస్టడీకి తీసుకున్న నుంగంబాక్కం పోలీసులు స్టేషన్‌కు తీసుకుని వెళ్లి విచారిస్తున్నారు.
గురువారం స్వాతి స్నేహితుడైన ట్రిప్లికేన్ ప్రాంతానికి చెందిన బిలాల్‌ మాలిక్‌ను కూడా పోలీసులు విచారిస్తున్నారు. నుంగంబాక్కం పోలీసుస్టేషన్‌కు బైకులో వెళ్లిన బిలాల్‌ మాలిక్‌ పరిసరాల్లో మీడియా హడావిడి చూసి హెల్మెట్‌ తోనే స్టేషన్‌లోపలకు వెళ్లాడు. తనను ఓ యువకుడు తరచూ వెంబడిస్తున్నాడంటూ స్వాతి తనకు పలుమార్లు తెలిపిందని స్వాతితో పాటు పనిచేసిన మాలిక్‌ హత్య జరిగిన వెంటనే పోలీసుల వద్దకు వెళ్లి వాం గ్మూలమిచ్చాడు.

Infosys techie murder case: Ram Kumar's statement recorded

ప్రస్తుతం తమ కస్టడీలోకి తీసుకున్న రామ్‌కుమార్‌ వద్ద జరుపుతున్న విచారణలో భాగంగానే పోలీసులు మాలిక్‌ను పిలిపించారని సమాచారం. స్వాతి తనను వెంబడించిన యువకుడి రూపు రేఖలేవైనా మాలిక్‌కు చెప్పిందా అని పోలీసులు ప్రశ్నించారనీ, స్వాతి చెప్పిన ఆనవాళ్ల ప్రకారం రామ్‌కుమార్‌ ఉన్నాడా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవడానికే పోలీసులు అతడిని రప్పించారని అంటున్నారు.

పోలీసుల విచారణలో రామ్‌కుమార్‌ స్వాతితో తనకు పరిచయం ఎలా ఏర్పడిందీ, ఆ తర్వాత ఆమెను ఎలా ప్రేమించిందనే వివరాలను చెప్పాడు. బీఈ ఫెయిలైన తాను సంపాదన కోసం చెన్నై వచ్చాననీ, ఆ సమయంలో సూర్యప్రకాశ్ అనే స్నేహితుడి ద్వారా స్వాతితో పరి చయమేర్పడిందని చెప్పాడు. స్వాతి తనతో చాలాక్లోజ్‌గా ఉండేదనీ, రోజుల తరబడి ఆమెతో మాట్లాడానని, ఆమెను గాఢంగా ప్రేమించానని తెలిపాడు.

ఫేస్‌బుక్‌లో తాను ప్రైవేట్‌ సంస్థలో కంప్యూటర్‌ ఇంజనీర్‌గా నెలకు లక్షరూపాయలు సంపాదిస్తున్న ట్లు తెలిపానని, ఆ తర్వాత స్వాతి తనతో సెల్‌ఫోన్‌లో మాట్లాడేదనీ, ఆమెకోసమే తాను చూళైమేడు మేన్షన్‌లో అద్దెకు దిగానని చెప్పాడు. చూళైమేడులోని గుడికి తామిద్దరం కలిసి చాలాసార్లు వెళ్లామని చెప్పినట్లు సమాచారం.

ఆ తర్వాత తాను బట్టల దుకాణంలో చేరి సంపాదించిన జీతంతో పాటు ఊరి నుంచి తల్లిదండ్రులు పంపే డబ్బుని స్వాతి కోసమే ఖర్చు చేశానని, తన బట్టల దుకాణంలోని కొత్త డిజైన్ బట్టలు వేసుకుని వెళ్తుండంతో ఆమె తనను ఓ ధనవంతుడి బిడ్డగా భావించిందనీ, అప్పటి వరకూ సాఫీగా కొనసాగిన తమ స్నేహంలో ఓ రోజు స్వాతి తాను బట్టల దుకాణంలో పని చేస్తుండగా చూడటంతో విభేదాలు పొడసూపాయని చెప్పాడు,

ఆ తర్వాత ఆమె తనను దుర్భాలాషలాడిందనీ, సాఫ్ట్‌వేర్‌ఇంజనీర్‌ అనీ, లక్ష రూపాయల జీతమని తనతో ఎందుకు అబద్ధాలు చెప్పావంటూ కోపగించుకుందని రామ్‌కుమార్‌ పోలీసుల విచారణలో తెలిపాడు. చివరకు తనతో మాట్లాడటం మానివేసిందనీ, అప్పటి నుంచి ఆమెపై తాను కక్ష పెంచుకుని, తన ప్రేమను తిరస్కరించిందనే ఆగ్రహంతోనే చంపానని రామ్ కుమార్ విచారణలో తెలిపాడు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Accused Ram Kumar has accepted that he killed Infosys techie Swath, as she rejected his love in Tamila Nadu.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి