• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జయలలిత మృతి: ఉపరాష్ట్రపతి, గవర్నర్, పన్నీర్ సెల్వంను విచారణ చెయ్యాలి, పిటిషన్!

|
  Jayalalithaa Case probe : విచారణకు వెంకయ్యనాయుడు, విద్యాసాగర్‌రావు కూడా !

  చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి అమ్మ జయలలిత అనుమానాస్పద మృతిపై విచారణ ముమ్మరంగా జరుగుతోంది. ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావ్, తమిళనాడు ఉప ముఖ్య మంత్రి పన్నీర్ సెల్వంను విచారణ చెయ్యాలని విచారణ కమిషన్ లో పిటిషన్ దాఖలు అయ్యింది. జయలలిత మృతిపై విచారణ కోసం ఏర్పాటైన విచారణ కమిషన్‌ ముందు పలువురు ప్రముఖులు హాజరై విచారణ ఎదుర్కొంటున్నారు.

  పార్టీ, రెండాకులు కోతుల చేతికి వెళ్లాయి, కోతి చేతికి చిప్ప ఇస్తే, సుప్రీం కోర్టుకు, మన్నార్ గుడి!

  జయలలిత అనుమానాస్పద మృతిపై మద్రాసు హైకోర్టు రిటైడ్ న్యాయమూర్తి జస్టిస్‌ ఆరుముగస్వామి ఆధ్వర్యంలో ఈ కమిషన్‌ ఏర్పాటు అయ్యింది. అమ్మ జయలలిత అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో బీ ఫారంపై అమ్మ వేలిముద్రలు వేసిన విషయం తెలిసిందే.

   అమ్మ మృతి తర్వాతే వేలిముద్రలు

  అమ్మ మృతి తర్వాతే వేలిముద్రలు

  జయలలిత మృతి తర్వాతే వేలిముద్రలను బీ ఫారంలో వేయించారని తమిళనాడులోని తిరుప్పరకుండ్రం శాసన సభ నియోజక వర్గం డీఎంకే పార్టీ అభ్యర్థి డాక్టర్‌ శరవణన్‌ ఆరోపించారు. గురువారం కూడా డాక్టర్ శరవణన్ రిటైడ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు.

   ఫోరెన్సిక్ ల్యాబ్ లో పరిశీలన

  ఫోరెన్సిక్ ల్యాబ్ లో పరిశీలన

  జయలలిత వేలిముద్రలు వేసిన బీ ఫారంలు ఫోరెన్సిక్‌ ల్యాబ్ కు పంపించి అవి అమ్మ వేలిముద్రలా, కాదా, అనే విషయంపై పరిశీలిస్తామని విచారణ కమిషన్‌ హామీ ఇచ్చిందని డాక్టర్‌ శరవణన్‌ మీడియాకు చెప్పారు. జయలలిత మరణించిన తరువాత వేలిముద్రలు బీఫారంలో వేయించారని డీఎంకే పార్టీ నాయకుడు డాక్టర్ శరవణన్ గట్టిగా చెబుతున్నారు.

  ప్రభుత్వ ఆసుపత్రి డీన్ హాజరు

  ప్రభుత్వ ఆసుపత్రి డీన్ హాజరు

  చెన్నైలోని రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆస్పత్రి డీన్‌ డాక్టర్ ఆర్. నారాయణ బాబు, డాక్టర్ మయివహనన్‌లు రిటైడ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ముందు హాజరైనారు. జయలలిత చికిత్స విషయంలో రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుప్రతి డీన్ నారాయణ బాబు, డాక్టర్ మయివహనన్ వివరణ ఇచ్చారు.

  రహస్యంగా ఎందుకు పెట్టారు?

  రహస్యంగా ఎందుకు పెట్టారు?

  జయలలిత అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందినప్పుడు ఆమెకు అందించిన వైద్య సేవలను రహస్యంగా ఉంచారని, అమ్మను చూడటానికి వెళ్లిన వారికి అనుమతి నిరాకరించడం వంటి పరిణామాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయని, ఈ విషయాలపై లోతుగా దర్యాప్తు చెయ్యాలని జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ విచారణ కమిషన్‌ ముందు పిటిషన్ దాఖలు చేశారు.

   శశికళ, అంబులెన్స్ డ్రైవర్ విచారణ

  శశికళ, అంబులెన్స్ డ్రైవర్ విచారణ

  వీకే శశికళ నటరాజన్, ఆమె కుటుంబ సభ్యులతో పాటు జయలలితను ఆస్పత్రికి తరలించిన అంబులెన్స్‌ డ్రైవరు నుంచి అపోలో ఆసుపత్రిలో చికిత్స అందించిన వైద్య సిబ్బంది వరకు అందరినీ లోతుగా విచారించాలని జయలలిత మేనకోడలు దిపా జయకుమార్ పిటిషన్ లో మని చేశారు.

  గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావ్!

  గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావ్!

  మదురైకు చెందిన ప్రముఖ న్యాయవాది నందిని రిటైడ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి విచారణ కమిషన్ లో పిటిషన్‌ దాఖలు చేశారు. పన్నీర్‌సెల్వంతో ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేయించిన అప్పటి తమిళనాడు ఇన్‌ఛార్జ్ గవర్నర్‌ సీహెచ్. విద్యాసాగర్‌రావును విచారణ చెయ్యాలని న్యాయవాది నందిని మనవి చేశారు.

  ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు!

  ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు!

  జయలలితను అపోలో ఆస్పత్రిలో చేర్పించినప్పటి నుంచి ఆమె అంత్యక్రియలు పూర్తి అయ్యే వరకు చెన్నైలో ఉన్న అప్పటి కేంద్ర మంత్రి, ప్రస్తుత ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, అప్పట్లో ఆమె ఆరోగ్య పరిస్థితి, వైద్యచికిత్సలను రాష్ట్ర హోంశాఖ నివేదికల ద్వారా పర్యవేక్షించిన ప్రస్తుత తమినాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంను కూడా విచారించి వివరాలు సేకరించాలని మదురైకి చెందిన న్యాయవాది నందిని పిటిషన్ లో మనవి చేశారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Two senior state government doctors on Thursday appeared before the Justice Arumughaswamy Commission, which is probing the death of former Tamil Nadu chief minister and AIADMK supremo Jayalalithaa. Rajiv Gandhi Government General Hosptia dean Dr Narayana Babu and Dr Mayivahanan appeared before the judge based on summons issued to them and answered to the queries raised by him.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more