Jeff Bezos Space Trip :విజయవంతంగా జెఫ్ బెజోస్ అంతరిక్షయాత్ర... 10 నిమిషాల్లో భూమిని చేరిన క్యాప్సూల్

ప్రపంచ కుబేరుడు,అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ అంతరిక్షయాత్ర విజయవంతమైంది. బ్లూ ఆరిజిన్‌ అభివృద్ది చేసిన న్యూ షెపర్డ్ వ్యోమనౌకలో జెఫ్ బెజోస్ బృందం నింగిలోకి దూసుకెళ్లింది. కేవలం పదంటే పది నిమిషాల్లో ఈ యాత్ర పూర్తవడం విశేషం. న్యూ షెఫర్డ్ వ్యోమనౌక భూమి నుంచి 45 మైళ్ల దూరం నింగిలో ప్రయాణించాక.. దాని నుంచి క్యాప్సూల్ విడివడింది. ఈ క్యాప్సూల్ భూమి నుంచి 62 మైళ్ల దూరం వరకు నింగిలో ప్రయాణించింది. ఇటీవలే అంతరిక్షయాత్ర చేపట్టిన రిచర్డ్ బ్రాన్సన్ నేత్రుత్వంలోని వర్జిన్ గెలాక్టిక్ వ్యోమనౌక అంతరిక్షంలో 50 మైళ్ల దూరం ప్రయాణించగా... ఆ రికార్డును జెఫ్ బెజోస్ అంతరిక్షయానం బ్రేక్ చేసింది.

అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 9.00గంటల సమయంలో టెక్సాస్‌ ఎడారి ప్రాంతంలోని ఓ ప్రదేశం నుంచి న్యూ షెఫర్డ్ వ్యోమనౌక నింగిలోకి దూసుకెళ్లింది. అంతకుముందు,8.30గంటల సమయానికి జెఫ్ బెజోస్ బృందం ఆ ప్రదేశానికి చేరుకుంది. ఆ తర్వాత న్యూ షెఫర్డ్ స్పేస్ క్రాఫ్ట్‌లోకి అంతా ఒకేసారి ఎక్కారు. 8.45గంటల సమయంలో క్యాప్సూల్ తలుపులు మూసుకున్నాయి. 9గంటల సమయంలో స్పేస్ క్రాఫ్ట్ నింగిలోకి దూసుకెళ్లింది. అంతరిక్షంలో సుమారు నాలుగు నిమిషాల పాటు జెఫ్ బెజోస్ బృందం జీరో గురుత్వాకర్షణ ప్రభావాన్ని(బరువు లేని తేలియాడే స్థితిని) అనుభూతి చెందింది. పది నిమిషాల్లోనే దాదాపు 62 మైళ్ల దూరం ప్రయాణాన్ని ముగించుకుని స్పేస్ క్రాఫ్ట్ క్యాప్సూల్ తిరిగి భూమిని చేరింది. దీంతో జెఫ్ బెజోస్ బృందం విజయానందంలో మునిగిపోయింది.

jeff bezos blue origin space trip completes successfully from texas

జెఫ్ బెజోస్‌తో పాటు ఆయన సోదరుడు మార్క్,82 ఏళ్ల మాజీ పైలట్ వాలీ ఫంక్,18 ఏళ్ల టీనేజర్ అలివర్ డేమన్ రోదసియాత్రలో భాగస్వాములయ్యారు. అంతరిక్షంలోకి వెళ్తున్న అత్యంత పిన్న వయస్కుడిగా అలివర్,అత్యంత పెద్ద వయస్కుడిగా వాలీ ఫంక్ చరిత్ర సృష్టించారు.భవిష్యత్తులో స్పేస్ టూరిజాన్ని అందించాలన్న లక్ష్యంతో జెఫ్ బెజోస్ దీన్ని చేపట్టారు.

ఇటీవలే ప్రముఖ బ్రిటీష్ కుబేరుడు రిచర్డ్ బ్రాన్సన్ అంతరిక్షయాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. వ్యోమనౌక వీఎస్‌ఎస్‌ యూనిటీ-22లో రిచర్డ్ సహా ఆరుగురు.. నింగిలోకి దూసుకెళ్లారు. ఇందులో తెలుగమ్మాయి బండ్ల శిరీష కూడా ఉండటం విశేషం. గతంలో 3 సార్లు స్పేస్‌ క్రాఫ్ట్‌లను అంతరిక్షంలోకి పంపిన వర్జిన్‌ గెలాక్టిక్... తాజా ప్రయోగంలో మానవసహిత స్పేస్ క్రాఫ్ట్‌ను విజయవంతంగా నింగిలోకి పంపించగలిగింది. భవిష్యత్తులో సాధారణ ప్రజలకు స్పేస్ టూరిజాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ఈ యాత్ర చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+