వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవినీతిపై కథనం, బెదిరింపు: జర్నలిస్ట్ అదృశ్యం

By Srinivas
|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: బెంగాలీ డెయిలీకి చెందిన ఓ విలేకరి అదృశ్యమైన సంఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగింది. అదృశ్యమైన విలేకరి అలిపుర్‌దౌర్‌ జిల్లాకు చెందినవాడు.

బెంగాళీ డెయిలి పత్రికకు చెందిన చాయన్‌ సర్కార్‌ అనే విలేకరి ఇటీవల ఓ కళాశాలలో ప్రవేశాల సందర్భంగా జరుగుతున్న అవినీతిని బయటపెట్టే కథనం రాశాడు. దీంతో ఆయనను పలువురు చంపుతామంటూ బెదిరింపులు వచ్చాయి.

Journalist missing in West Bengal

అనంతరం ఆ విలేకరి తనను బెదిరించిన ఎనిమిది మంది పైన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులు వారిని అరెస్టు చేశారు.

ఆ అరెస్టు జరిగిన తర్వాత నుంచి విలేకరి కనిపించకుండా పోయాడు. అతని కోసం గాలిస్తున్నారు. ఆదివారం నుంచి ఆయన కనిపించకుండా పోయాడని చెప్పారు. అతనిని ఎవరో కిడ్నాప్‌ చేశారని, చాయన్‌ స్కూటర్, పర్సు, పుస్తకం ఒకచోట లభించాయని పోలీసులు తెలిపారు. ఆ కళాశాలలో అవినీతికి పాల్పడిన వారే ఈ ఘటనకు కూడా పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

English summary
The reporter of a Bengali daily is missing from his home in Alipurduar district since Sunday after eight persons, earlier named by him in an FIR for issuing threats for writing a college admission bribery story, were arrested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X