• search
 • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కరోనాను మించి.. అగ్గిరాజేసిన హీరోయిన్ జ్యోతిక.. మండిపడుతోన్న హిందూ వాదులు..

|

గత వారం రోజులుగా తమిళ సోషల్ మీడియాలో జ్యోతిక హాట్ టాపిక్‌గా మారారు. మార్చి నెల ఆరంభంలో జరిగిన ఓ సినీ అవార్డుల ఫంక్షన్‌లో ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. జ్యోతిక వ్యాఖ్యలు హిందూ దేవాలయాలతో ముడిపడి ఉండటంతో వివాదం అంతకంతకూ ముదురుతోంది. నిజానికి ఆమె చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని ప్రశ్నిస్తున్నవారు కొందరైతే.. ఆలయాలనే టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా శ్రీ విల్లిపుత్తూర్ ఆండాల్ ఆలయ స్వామిజీ శ్రీ శఠగోప రామానుజ జీయర్ జ్యోతిక వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకీ ఆమె ఏం మాట్లాడారు.. వివాదం ఎందుకింతలా ముదురుతోంది.. కరోనాను మించి దీనిపైనే ఎందుకు చర్చ జరుగుతోంది?

అసలేం జరిగింది..

అసలేం జరిగింది..

గత నెలలో 'జస్ట్ ఫర్ వుమెన్' అనే ఓ మేగజైన్ సినీ అవార్డుల ఫంక్షన్‌ను నిర్వహించింది. ఇందులో భాగంగా రాచ్చసి(2019) సినిమాలో నటనకు గాను హీరోయిన్ జ్యోతిక ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కనీస మౌలిక సదుపాయాలు లేని ఓ పాఠశాలను ఓ హెడ్ మాస్టర్ ఎలా సంస్కరించింది.. ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు సృష్టిస్తున్న అడ్డంకులకు ఎదురొడ్డి ప్రభుత్వ పాఠశాలను సమర్థవంతంగా ఎలా నిర్వహించింది అన్నది ఈ సినిమా కథాంశం. అవార్డు అందుకున్న సందర్భంగా జ్యోతిక చేసిన ప్రసంగంలో ఈ అంశాలను ప్రస్తావిస్తూ ఓ కీలక విషయాన్ని చర్చకు పెట్టారు.

ఆలయాలు.. స్కూళ్ల ప్రస్తావన..

ఆలయాలు.. స్కూళ్ల ప్రస్తావన..

తంజావూరులో తాను సినిమా షూటింగ్‌లో పాల్గొన్నప్పుడు.. అక్కడి బృహదీశ్వర ఆలయం గురించి తనతో చాలామంది చెప్పారని జ్యోతిక అన్నారు. ఆ ఆలయం అత్యద్భుతంగా ఉంటుందని.. తంజావూరు వచ్చినవారు దాన్ని చూడకుండా వెళ్లకూడదని అన్నట్టు చెప్పారు. అయితే అంతకుముందే తాను ఆ ఆలయాన్ని చూశానన్నారు. ఉదయ్‌పూర్‌లోని ప్యాలెస్‌ల తరహాలో అది చాలా అందంగా ఉంటుందన్నారు. ఆ మరుసటి రోజే తాను ఓ స్కూల్లో షూటింగ్‌కు వెళ్లానని.. అక్కడి పరిస్థితులు చాలా అద్వాన్నంగా ఉన్నాయని చెప్పారు. కనీస సౌకర్యాలు,మౌలిక సదుపాయాలు ఆ స్కూల్లో లేవన్నారు.

స్కూళ్లు,ఆసుపత్రులు ముఖ్యమన్న జ్యోతిక..

స్కూళ్లు,ఆసుపత్రులు ముఖ్యమన్న జ్యోతిక..

రాచసి సినిమాలో దర్శకుడు భాస్కర్ ఓ విషయం చెప్పారని గుర్తుచేశారు. 'మీరు దేవాలయాల కోసం చాలా డబ్బును విరాళంగా ఇస్తుంటారు. వాటి పెయింటింగ్,నిర్వహణకు చాలా డబ్బును వెచ్చిస్తుంటారు. వెళ్లిన ప్రతీసారి హుండీలో డబ్బులు వేస్తుంటారు. అలాగే స్కూళ్లు,ఆసుపత్రుల నిర్వహణకు కూడా అంతే డబ్బును వెచ్చించండి. అవి మనకు చాలా ముఖ్యమైనవి.' అని సినిమాలో చెప్పిన సందేశాన్ని వివరించారు. ఆరోజు షూటింగ్ స్పాట్‌లో స్కూల్ పరిస్థితిని చూశాక.. ఇక ఆ ఆలయాన్ని సందర్శించలేదని జ్యోతిక అన్నారు. తన అభిప్రాయం ప్రకారం.. ఆసుపత్రులు,స్కూళ్లు మనకు చాలా అవసరమని పేర్కొన్నారు.

జ్యోతికపై ట్రోలింగ్స్.. తప్పేముందని మరికొందరు..

జ్యోతికపై ట్రోలింగ్స్.. తప్పేముందని మరికొందరు..

గత ఆదివారం విజయ్ టీవిలో జ్యోతిక స్పీచ్ టెలికాస్ట్ అయింది. అప్పటినుంచి సోషల్ మీడియాలో కొంతమంది ఆమెపై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్నారు. ఆలయాల గురించి మాట్లాడేదానివి.. మసీదులు,చర్చిల గురించి మాత్రం ఎందుకు మాట్లాడవని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు,సూర్య తన భార్యను ఎందుకు కంట్రోల్ చేయట్లేదని మండిపడుతున్నారు. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఆసుపత్రులపై ఎంతలా ఆధారపడుతున్నాయో చూస్తున్నాం. కాబట్టి ఆలయాలకు భారీ నిధులు వెచ్చిస్తున్నప్పుడు.. స్కూళ్లు,ఆసుపత్రులకు మాత్రం ఎందుకు వెచ్చించకూడదని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

  Jwala Gutta Dates Tamil Actor, Gets Intimate
  ఆగ్రహం వ్యక్తం చేసిన రామానుజ జీయర్

  ఆగ్రహం వ్యక్తం చేసిన రామానుజ జీయర్

  ఇదే అంశంపై శ్రీ విల్లిపుత్తూర్ ఆండాల్ ఆలయ స్వామిజీ శ్రీ శఠగోప రామానుజ జీయర్ స్పందించారు. జ్యోతిక వ్యాఖ్యలను ఖండించిన ఆయన.. ఆమె వ్యాఖ్యలు తంజావూర్ ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆలయాలు ఉండటం వల్లే మనం బతకగలుగుతున్నామని అన్నారు. జ్యోతిక ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాలని హెచ్చరించారు. గతంలోనూ ఆమె కుటుంబం ఇలాగే మాట్లాడిందన్నారు. అయితే స్వామిజీ వ్యాఖ్యలతో కొంతమంది విభేదిస్తున్నారు. సినీ ఇండస్ట్రీలోనూ పలువురు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. మొత్తం మీద జ్యోతిక వ్యాఖ్యలపై ఆమెను సమర్థించేవారు కొందరైతే.. వ్యతిరేకించేవారు మరికొందరు. ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది.

  English summary
  Over the past week, Tamil social media has been preoccupied with actor Jyothika and her speech at a recent award show, where she highlighted the need to donate to hospitals and schools as much as temples. Jyothika was speaking at an award function hosted by the monthly magazine, Just For Women (JFW).
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X