కాంగ్రెస్ను ముంచేందుకే ఆయన పుట్టారు: కంగనా రనౌత్
బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై నిప్పులు చెరిగారు. 'రైజింగ్ భారత్ సమ్మిట్ 2026'లో పాల్గొన్న ఆమె.. రాహుల్ గాంధీ తీరుపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ సంచలనంగా మారాయి. పార్లమెంటులో ఆయన తీరు ఓ బాధ్యతాయుతమైన నాయకుడిలా కాకుండా.. గూండా లేదా పోకిరి లాగా ఉందని ఆమె ఘాటుగా విమర్శించారు. సభలో స్పీకర్ వైపు చూడకుండా తన సొంత పార్టీ సభ్యుల వైపు తిరిగి మాట్లాడటం.. నిరసనల పేరుతో అసంబద్ధంగా ప్రవర్తించడం ప్రజాస్వామ్యానికే అవమానమని ఆమె పేర్కొన్నారు. ఆయన ప్రవర్తనలో పరిణతి లేదని, కేవలం గారాబంగా పెరిగిన బిడ్డలాగా అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
గాంధీజీ కలను నిజం చేస్తున్న రాహుల్!
మహాత్మా గాంధీ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని కోరుకున్నారని.. కానీ అప్పట్లో ఆ కోరిక నెరవేరలేదని కంగనా గుర్తు చేశారు. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ తన చేష్టల ద్వారా కాంగ్రెస్ పార్టీని సమూలంగా నాశనం చేస్తూ.. ఆనాడు గాంధీజీ కన్న కలను అక్షరాలా నిజం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాహుల్ తీరు చూసి కాంగ్రెస్ శ్రేణులు సైతం తలదించుకుంటున్నాయని.. పార్టీని కాపాడుకోవాలంటే నాయకత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు.

రాహుల్ గాంధీ - దేశానికి ఒక ముప్పు!
రాహుల్ గాంధీని దేశ భద్రత, ఆర్థిక వ్యవస్థకు ఓ పెద్ద ముప్పుగా కంగనా అభివర్ణించారు. రాహుల్ గాంధీ తక్కువ ఐక్యూ ఉన్న వ్యక్తి అని, ఆయన విదేశీ శక్తుల చేతుల్లో కీలుబొమ్మగా మారారని ఆరోపించారు. అంతర్జాతీయ వేదికలపై భారత ప్రజాస్వామ్యాన్ని కించపరచడం, దేశ ఆర్థికాభివృద్ధిని అడ్డుకునేలా మాట్లాడటం వెనుక విదేశీ శక్తుల ప్రమేయం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ అపరిపక్వ నిర్ణయాలు దేశానికి నష్టం కలిగిస్తాయని ఆమె హెచ్చరించారు.
మోదీ దగ్గర పాఠాలు.. రాహుల్ దగ్గర గుణపాఠాలు!
రాజకీయాల్లో తాను ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నానని కంగనా వినమ్రంగా చెప్తూనే రాహుల్ గాంధీపై సెటైర్లు వేశారు. తాను ప్రధాని మోదీని చూసి రాజకీయాల్లో ఎలా రాణించాలో నేర్చుకుంటున్నానని.. అదే సమయంలో రాహుల్ గాంధీని చూసి రాజకీయాల్లో ఏం చేయకూడదో నేర్చుకుంటున్నానని ఆమె స్పష్టం చేశారు. నాయకత్వానికి ఉండాల్సిన లక్షణాలు ఏంటో మోదీని చూసి.. నాయకత్వం ఎలా ఉండకూడదో రాహుల్ని చూసి అర్థం చేసుకోవచ్చని ఆమె ముగించారు.
-
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్












Click it and Unblock the Notifications