"ప్రధానమంత్రి ఒమన్ లో.. ప్రతిపక్షనేత జర్మనీలో.. దేశం కాలుష్యంలో"
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, దిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎక్స్ వేదికగా షాకింగ్ పోస్టు పెట్టారు. " దేశ ప్రధానమంత్రి ఒమన్ లో ఉన్నారు.. ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ జర్మనీలో ఉన్నారు.. దేశ రాజధాని కాలుష్యంలో ఉంది" అని కేజ్రీవాల్ వ్యంగ్యంగా పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దేశ రాజధానిలో వాయు కాలుష్యం రోజురోజుకూ క్షీణిస్తోంది. అక్కడి పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. ఈ క్రమంలో దిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్.. దిల్లీలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. గత రెండు నెలలుగా భారీగా కాలుష్యం పెరిగిపోతోంది. వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టినా కాలుష్యం ఏమాత్రం తగ్గడం లేదు. ఈక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక పోస్టు పెట్టారు. ప్రస్తుతం పంజాబ్ పర్యటనలో ఉన్న ఆయన సామాజిక మాధ్యమమైన ఎక్స్ వేదికగా ఈ పోస్టు పెట్టారు. దేశ రాజధానిలో రోజురోజుకూ పెరిగిపోతున్న కాలుష్యంపై కేంద్ర ప్రభుత్వం కానీ.. విపక్ష పార్టీలు కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో " దేశ ప్రధానమంత్రి ఒమన్ లో ఉన్నారు.. ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ జర్మనీలో ఉన్నారు.. దేశ రాజధాని కాలుష్యంలో ఉంది" అని కేజ్రీవాల్ వ్యంగ్యంగా చేసిన పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. చాలా మంది నెజిజన్లు కేజ్రీవాల్ పోస్టును సమర్థిస్తుండగా మరికొంత మంది మాత్రం కేజ్రీవాల్ ప్రస్తుతం పంజాబ్ లో ఉన్నారని ఎద్దేవా చేస్తున్నారు. దిల్లీ ముద్దు బిడ్డకు పంజాబ్ లో ఏం పని అంటూ వ్యగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

ఇక దిల్లీలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు అక్కడి ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలను అమల్లోకి తీసుకొచ్చింది. డిసెంబర్ 18 నుంచి కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్ లేని వాహనాలకు దిల్లీలోని పెట్రోల్ స్టేషన్లలో గురువారం నుంచి ఇంధనం అందించకూడదని స్పష్టం చేసింది.
प्रधान मंत्री ओमान में,
— Arvind Kejriwal (@ArvindKejriwal) December 18, 2025
नेता विपक्ष जर्मनी में,
देश की राजधानी प्रदूषण में…
అంతేకాక దిల్లీ బయట రిజిస్టర్ అయిన బీఎస్- 4 ప్రమాణాలు పాటించని ప్రైవేటు వాహనాలకు రాజధానిలోకి ప్రవేశం ఉండదని రూల్స్ లో పేర్కొంది. అలాగే దిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలన్నీ 50 శాతం మంది ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఇవ్వాలని ఆదేశించింది అక్కడి ప్రభుత్వం. వర్క్ ఫ్రమ్ హోమ్ నిబంధనలను ఉల్లంఘించే సంస్థలపై జరిమానాలు విధిస్తామని హెచ్చరికలు జారీ చేసింది.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications