విజయ్ మనసులో బీజేపీ ఉంది.. జరిగేది ఇదే: ఎన్నికల వేళ కుష్బూ సంచలనం
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. పోలింగ్ కు మరో 20 రోజులే ఉండటంతో తమిళనాడులోని అన్ని పార్టీలు ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. మరోసారి అధికారంలోకి రావాలని అధికార డీఎంకే ప్రణాళికలు రచిస్తోంది. అయితే ఈసారి విజయం తమదేనని రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షమైన ఏఐఏడీఎంకే పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగుతున్న స్టార్ హీరో, విజయ్ దళపతి టీవీకే పార్టీ శ్రమిస్తోంది. ఇటీవల 234 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు విజయ్. ఈ మేరకు వాళ్లందరినీ గెలిపించే బాధ్యత తనపై వేసుకున్నారు.
అటు పుదుచ్చేరిలోనూ ఎన్నికల నేపథ్యంలో విజయ్ టీవీకే పార్టీ అక్కడ కూడా పోటీ చేస్తోంది. ఇటీవల పుదుచ్చేరిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో విజయ్ అక్కడి ప్రజలపై హామీల వర్షం కురిపించారు. పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ లు పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పించడంలో విఫలం అయ్యాయని మండిపడ్డారు. అలాగే పేద కుటుంబాలకు ఫ్రీ విద్యుత్ అందిస్తామని విజయ్ హామీ ఇచ్చారు. అంతేకాక అర్హులైన ప్రతి కుంటుబానికి రూ. 25 లక్షల బీమా కల్పిస్తామని విజయ్ స్పష్టం చేశారు. పుదుచ్చేరి ఎన్నికల్లో తాము తొలిసారి బరిలోకి దిగుతున్నామని విజయ్ అన్నారు. సుపరిపాలన అందించడమే టీవీకే లక్ష్యం అని విజయ్ స్పష్టం చేశారు.
தவெக தலைவர் விஜய் மனதில் பாஜக இருப்பதாக நடிகை குஷ்பூ கருத்து ... புதுச்சேரி பிரச்சாரத்தில் விஜய் தவறுதலாக பாஜக வேட்பாளரின் பெயரை உச்சரித்தது குறித்து கருத்து...#Khushboo #BJP #TVKVijay #TVK #Election2026 #Newstamil24x7 pic.twitter.com/rcROnyjHxF
— News Tamil 24x7 (@NewsTamilTV24x7) April 5, 2026
అయితే పుదుచ్చేరిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయ్ తన టీవీకే పార్టీకి చెందిన అభ్యర్థిని గెలిపించాలని చెప్పాల్సి ఉండగా.. మర్చిపోయి బీజేపీ అభ్యర్థి పేరు చెబుతారు.. విజయ్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. అయితే ఇదే విషయంపై తమిళనాడు బీజేపీ వైస్ ప్రెసిడెంట్, సీనియర్ నటి కుష్బూను పలువురు రిపోర్టర్లు ప్రశ్నలు వేయగా బీజేపీ నేత కుష్బూ కీలక వ్యాఖ్యలు చేశారు. "విజయ్ మనసులో బీజేపీ ఉంది. అందుకే ఆయన నోట బీజేపీ అభ్యర్థి పేరు వచ్చింది" అని కుష్బూ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

ఇక పుదుచ్చేరిలోని 30 స్థానాలకు గాను ఏప్రిల్ 9న ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు మే 4న నిర్వహించనున్నారు. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ, గెలుపే లక్ష్యంగా అధికార, విపక్ష పార్టీలు పోటీ పడుతున్నాయి. మరోవైపు తమిళనాడులోని 234 స్థానాలకు గానూ ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది. మే 4 న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
-
తమిళనాడు, బెంగాల్ ఎంపీల్లేకుండా పార్లమెంటా ? చిదంబరం డౌట్స్..! -
తమిళనాడు ఎన్నికల్లో అనూహ్యం- థోళ్ తిరుమావళన్ యూటర్న్ -
తమిళనాట కొత్త లెక్కలు, సైలెంట్ సపోర్ట్ - సంచలనం ఖాయం..ప్రముఖ సర్వే రిపోర్ట్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
Tamil Nadu Election: ఒక్కో అఫిడవిట్లో ఒకలా- చిక్కుల్లో విజయ్ ? పోటీపై అనర్హత? -
Tamil nadu BJP First List: 27మందితో బీజేపీ ఫస్ట్ లిస్ట్-అన్నామలైకి షాక్..! -
తమిళనాడుకు తదుపరి సీఎం నేనే: త్రిష సంచలన కామెంట్స్ వైరల్..!! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం..












Click it and Unblock the Notifications