రేప్ చేస్తా!: యువతికి ఉబెర్ క్యాబ్ డ్రైవర్ వేధింపులు

Subscribe to Oneindia Telugu

కోల్‌కతా: ఓ 27ఏళ్ల మహిళా ప్రయాణికురాలికి ఉబెర్ క్యాబ్ డ్రైవర్ నుంచి తీవ్ర లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. తన గమ్య స్థానం చేరుకునేందుకు సదరు యువతి క్యాబ్‌లో ఎక్కగా.. అతడు వేరే మార్గం గుండా తీసుకెళ్లాడు. దీంతో అప్రమత్తమైన యువతి అతడ్ని మందలించింది. ఎక్కువ మాట్లాడితే కిడ్నాప్ చేసి, రేప్ చేస్తానని బెదిరింపులకు గురిచేశాడు. దీంతో ఆమె కారు నుంచి బయటికి దూకేసింది. ఈ ఘటన పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. సాల్ట్ లేక్ సమీపంలోని జేడీ బ్లాక్ సమీపం నుంచి బాధితురాలు, తన స్నేహితురాలితో కలిసి రాత్రి 10 గంటల సమయంలో ఓ క్యాబ్ ను బుక్ చేసుకున్నారు. ఆపై తన స్నేహితురాలిని ఆర్యన్ భవన్ వద్ద దిగబెట్టి, తన గమ్యస్థానానికి వెళుతున్న వేళ ఈ ఘటన జరిగింది.

కారు రాంగ్ రూట్‌లో వెళుతున్న విషయాన్ని గమనించిన బాధితురాలు హెచ్చరించగా.. కాసేపు సరైన దారిలోనే వచ్చిన క్యాబ్ డ్రైవర్ మరోసారి తప్పు దారిలోకి కారును నడిపించాడు. దీంతో ఆమె ప్రమాదాన్ని గమనించి కేకలు పెడుతుంటే, డ్రైవర్ నోటికొచ్చినట్టు దూషించడం మొదలు పెట్టాడు.

Kolkata: Uber driver held over alleged molestation

కిటికీ అద్దాలు తెరచి సహాయం కోసం ఆమె అరుస్తూ, రోడ్డుపై ఎవరూ లేరని తెలుసుకుని కారులోంచి దూకేందుకు సిద్ధపడింది. ఆమె ప్రయత్నాన్ని గమనించిన డ్రైవర్, కాళ్లను బంధించేందుకు, ముందు సీటును వెనక్కు నెట్టాడు. కారు దిగాలని చూస్తే, గుద్ది చంపుతానని బెదరించాడు. దీంతో భయాందోళనకు గురైన యువతి.. కారు నుంచి సడన్‌గా కిందకు దూకింది.

ఆ తర్వాత కూడా కారును రివర్స్ చేసుకుని ఆమెపైకి ఎక్కించేందుకు డ్రైవర్ ప్రయత్నించగా... వెంటనే డివైడర్‌ను దాటుకుని అవతలి వైపు ఫుట్‌పాత్ వైపు వెళ్లి ప్రాణాలు కాపాడుకుంది. ఆ తర్వాత జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు సంతూ ప్రమాణిక్‌ను అరెస్ట్ చేశారు. కాగా, అతడ్ని తమ సర్వీసుల నుంచి సస్పెండ్ చేసినట్లు ఉబెర్ సంస్థ తెలిపింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
According to the 27-year-old complainant, the driver refused to take the car towards her destination and instead threatened to kidnap and rape her after dropping her co-passenger at Kolkata city's Aranya Bhavan on Monday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి