వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా: తూచ్.. తూచ్... ఆ రిపోర్ట్ తప్పు, 68 ఏళ్ల వృద్దుడికి పాజిటివ్ అనడంతో.. 6 అంబులెన్స్‌లు..

|
Google Oneindia TeluguNews

అప్పుడప్పుడు సిబ్బంది చేసే తప్పు ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. అసలే కరోనా పాజిటివ్ అంటే భయపడే పరిస్థితి వచ్చింది. దీంతో దగ్గి, తుమ్మితే చాలు అనుమాన పడే సిచుయేషన్.. అయితే యూపీలోని మొరదాబాద్‌లో ల్యాబ్ సిబ్బంది చేసిన తప్పు.. అధికారులను పరుగులు పెట్టించింది.

జ్వరం రావడంతో..

జ్వరం రావడంతో..

అమ్రోహకు చెందిన 68 ఏళ్ల వృద్దుడు ఇటీవల అస్వస్థతకు గురయ్యాడు. జలుబు, దగ్గుతో బాధపడ్డాడు. జ్వరం కూడా రావడంతో ఎందుకైనా మంచిదని పరీక్ష కోసం అలిఘడ్ ల్యాబ్ వద్దకొచ్చాడు. అక్కడ రక్త నమూనాలును సేకరించి.. మొరదాబాద్ జిల్లా ఆస్పత్రికి పంపించారు. అక్కడ పరీక్షించిన వారు కరోనా వైరస్ సోకిందని.. సోమవారం రాత్రి నిర్ధారించారు.

ఆరు అంబులెన్సులు..

ఆరు అంబులెన్సులు..

విషయాన్ని డాక్టర్ ఫరూక్ అధికారులకు తెలియజేశారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వృద్దుడి ఇంటికి వెంటనే ఆరు అంబులెన్స్‌లు పంపించారు. అతని ఎనిమిది మంది కుటుంబసభ్యులను క్వారంటైన్‌లోకి తరలించారు. అంతేకాదు వృద్దుడు ఎవరిని కలిశారు అనే విషయంపై కూడా ఆరాతీశారు. అయితే వృద్దుని కుటుంబసభ్యులకు చేసిన పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది. దీంతో ఏం జరిగిందా అని వైద్యులు ఆలోచించారు.

Recommended Video

Minister Perni Nani Reacts On Border Problem Intolerance On Telangana Government
పొరపాటుగా ప్రింట్

పొరపాటుగా ప్రింట్

అయితే వైద్య పరీక్షలు చేసిన సమయంలో వృద్దుడి పేరు పొరపాటుగా ల్యాబ్ సిబ్బంది రాసినట్టు తెలిపారు. పాజిటివ్ సోకిన వారి పేర్లతో కలిపారని.. ఇదే కాదు ఇదివరకు కూడా తప్పు జరిగిందని అధికారులు పేర్కొన్నారు. తప్పుగా ప్రింట్ అవడంతో అధికారులు పరుగులు తీశారు. బుధవారం ఆస్పత్రి నుంచి వృద్దుడిని డిశ్చార్జ్ చేశారు. అతని కుటుంబసభ్యులకు కూడా నెగిటివ్ రావడంతో వారిని కూడా ఇంటికి పంపించామని పేర్కొన్నారు.

English summary
An elderly man from Uttar Pradesh’s Amroha who was suffering from common cold and sore throat was wrongly declared coronavirus positive because of a typographical error by an Aligarh lab.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X