టెక్కీలకు లే ఆఫ్స్ దెబ్బ?: ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో!, భయం భయంగా..

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఐటీ కంపెనీల కఠిన నిర్ణయాలు ఉద్యోగులను కలవరపెడుతున్నాయి. ఎప్పుడే పిడుగు వార్త చెబుతారోనన్న భయంతో వారు కాలం వెళ్లదీస్తున్న పరిస్థితి. ఆటోమేషన్ ప్రభావానికి తోడు కంపెనీలన్ని వ్యయ భారాలను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తుండటంతో చాలామందికి 'పింక్ స్లిప్స్' తప్పడం లేదు.

ఐటీకి ఏమైంది?: కెరీర్‌పై నిజంగానే కత్తి వేలాడుతోందా?, ఇదీ అసలు మర్మం..

లే ఆఫ్స్ దెబ్బకు ఇటీవలి కాలంలో ఎంతోమంది సాఫ్ట్ వేర్ నిపుణులు ఉద్యోగాలను కోల్పోయారు. కింది స్థాయి ఉద్యోగులు అభద్రతా భావంలో కొట్టుమిట్టాడుతుంటే.. అటు మేనేజర్ స్థాయి ఉద్యోగాలపై కూడా కంపెనీలు కోత పెడుతూ వస్తుండటం గమనార్హం. వేతనాల విషయంలో భారీగా వెచ్చించాల్సి వస్తుండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

నిర్దాక్షిణ్యంగా వేటు.. కాస్ట్ కటింగ్ కూడా?: 'లే ఆఫ్స్'తో ఐటీ జీవులకు నిద్ర కరువు..

1శాతం వర్క్ ఫోర్స్ తగ్గింపు:

1శాతం వర్క్ ఫోర్స్ తగ్గింపు:

ఉద్యోగుల తొలగింపు కోసం పింక్‌ స్లిప్‌లు చేతిలో పెడుతున్న ఐటీ కంపెనీలు వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల కాలంలోనే టాప్‌-5లో ఉన్న ఇన్ఫోసిస్‌, విప్రో కంపెనీలు తమ వర్క్‌ఫోర్స్‌ను 1 శాతం మేర తగ్గించుకోవడం గమనార్హం.

ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలన్ని వ్యయాలు తగ్గించుకోవడం కోసం ప్రయత్నిస్తుండటంతో, ఇన్ఫోసిస్‌, విప్రో లాంటి కంపెనీలు ఉద్యోగాలకు కోత పెడుతున్నాయి. ఉన్న ఉద్యోగాల్లో నుంచి చాలామందిని తొలగించే ప్రక్రియను వేగవంతం చేశాయి.

 3,646మంది అవుట్:

3,646మంది అవుట్:

ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య కాలంలో ఈ రెండు కంపెనీలు 3,646 ఐటీ నిపుణులను కంపెనీలు తొలగించేశాయి. ఈ క్రమంలో రెండో క్వార్టర్‌లో విప్రో ఉద్యోగులు 1.82 శాతం మందిని తొలగించినట్టు డెక్కన్‌ హెరాల్డ్‌ నివేదిక చెబుతోంది. అలాగే ఇన్ఫోసిస్‌ కూడా భారీ ఎత్తునే ఉద్యోగులను తొలగించుకున్నట్టు చెబుతున్నారు.

 పడిపోయిన ఉద్యోగుల సంఖ్య:

పడిపోయిన ఉద్యోగుల సంఖ్య:

తొలి ఆర్నెళ్ల కాలంలో ఇన్ఫోసిస్‌1,924 ఉద్యోగులను తొలగించింది. విప్రో 1,722 మందిని తొలగించినట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీలు పేర్కొన్నాయి.

గత ఏప్రిల్‌లో ఇన్ఫోసిస్, విప్రో.. ఈ రెండు కంపెనీల్లో పనిచేసే మొత్తం ఉద్యోగులు 3,65,845 మంది ఉండగా సెప్టెంబర్ చివరినాటికి ఈ సంఖ్య 3,62,199కి పడిపోయింది. ఎక్కువ ఉద్యోగావకశాలకు కేంద్రంగా ఉన్న ఐటీలో క్రమంగా అవకాశాలు తగ్గిపోతున్నట్టు ఈ గణాంకాలు చెబుతున్నాయి.

పెరిగిన రెవెన్యూ, అభద్రతా:

పెరిగిన రెవెన్యూ, అభద్రతా:

మార్చి క్వార్టర్‌లో ఉన్న ఒక్కో ఉద్యోగి రెవెన్యూ 51,400 డాలర్ల నుంచి సెప్టెంబర్‌ క్వార్టర్‌కు 52,700 డాలర్లకు పెరిగింది. అంతర్గత విభేదాల కారణంగా కొన్ని నెలల క్రితం ఇన్ఫోసిస్‌ నుంచి వైదొలిగిన ఇన్ఫోసిస్‌ మాజీ సీఈవో, ఎండీ విశాల్‌ సిక్కా 2020 నాటికి ఒక్కో ఉద్యోగి రెవెన్యూ 80,000 డాలర్లు ఉండాలని గతంలోనే నిర్ణయించిన సంగతి తెలిసిందే.

ఇదంతా పక్కనపెడితే కంపెనీల లే ఆఫ్స్‌తో చాలామంది ఉద్యోగుల్లో అభద్రతా భావం నెలకొంది. ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందా అని వారు ఆందోళన చెందుతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
As digitisation and automation become the new normal, IT biggies like Infosys, wipro, congnizant and Tech Mahindra are seeing a spate of layoffs

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి