పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆరేళ్లపాటు సహజీవనం చేసి...
పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ నర్సింగ్ విద్యార్థినితో ఆరేళ్లపాటు ఓ వైద్య విద్యార్థి సహజీవనం చేసి చివరికి మరో యువతిని పెళ్లాడడంతో బాధిత నర్సింగ్ విద్యార్థిని పోలీసులను ఆశ్రయించిన ఉదంతమిది.
పూణే : పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ నర్సింగ్ విద్యార్థినితో ఆరేళ్లపాటు ఓ వైద్య విద్యార్థి సహజీవనం చేసి చివరికి మరో యువతిని పెళ్లాడడంతో బాధిత నర్సింగ్ విద్యార్థిని పోలీసులను ఆశ్రయించిన ఉదంతమిది.
పూణే నగరంలోని హదప్సర్ ప్రాంతానికి చెందిన యువకుడు(32) వైద్య విద్యను అభ్యసిస్తున్నాడు. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి ఆరేళ్లపాటు ఓ నర్సింగ్ విద్యార్థినితో సహజీవనం చేశాడు. తన తండ్రి ఆరోగ్యం బాగా లేదని, అత్యవసరమని చెప్పి ఆమెనుంచి మూడు లక్షల రూపాయలు కూడా తీసుకున్నాడు.

అనంతరం నర్సింగ్ విద్యార్థినికి తెలియకుండానే మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మోసపోయానని గ్రహించిన నర్సింగ్ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసి నిందితుడిని తమ కస్టడీలోకి తీసుకున్నామని పోలీసు అధికారిణి సుప్రియ చెప్పారు.












Click it and Unblock the Notifications