
మాజీ ప్రధాని మన్మోహన్‌కు అస్వస్థత.. ఛాతీలో నొప్పి, ఎయిమ్స్‌లో చేరిక..
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురయ్యారు. ఛాతి నొప్పి రావడంతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చేర్చారు. జ్వరం, నీరసంతోనూ ఆయన బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. 88 సంవత్సరాల మన్మోహన్ సింగ్ ఈ ఏడాది ఆరంభంలో కోవిడ్-19తో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. ఎయిమ్స్ డైరక్టర్ రణ్ దీప్ గులేరియా నేతృత్వంలో మన్మోహన్ సింగ్‌కు చికిత్సను అందిస్తున్నారు. మన్మోహన్ సింగ్‌కు రెండు రోజుల నుంచే జ్వరం ఉందని.. ఇవాళ ఆయన ఆరోగ్యం బాగా క్షీణించడంతో డాక్టర్ల సూచన మేరకు ఆయనను ఎయిమ్స్ కు తరలించినట్లు సమాచారం. ఈ ఏడాది ఏప్రిల్ 19వ తేదీన మన్మోహన్ సింగ్ కరోనా వైరస్ బారిన పడ్డారు. చికిత్స తర్వాత కోలుకున్న విషయం తెలిసిందే. రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మన్మోహన్ సింగ్‌కు కరోనా సోకింది.
మన్మోహన్ సింగ్ అనారోగ్యం గురించి కాస్త ఆందోళన కలిగింది. అయితే దీనిని కాంగ్రెస్ పార్టీ తేలికగా తీసుకుంది. జనరల్ చెకప్ కోసమే ఆయనను ఎయిమ్స్ తరలించామని వివరించింది. అతని ఆరోగ్య పరిస్థితి స్థిమితంగానే ఉందని.. కానీ కొందరు రూమర్లు ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. మన్మోహన్ హెల్త్‌కు సంబంధించి ఏ విషయమైనా సరే తెలియజేస్తామని తెలిపింది.

Recommended Video
మన్మోహన్ సింగ్‌కు ఛాతీలో నొప్పి వచ్చిందని కథనాలు వచ్చాయి. అయితే ఆయనకు 2009లో బై పాస్ సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. 1990 నుంచి ఆయన హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. 20004 వరకు ఐదు సార్లు స్టెంట్లు వేశారు. గతేడాది కూడా చాతీలో నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేర్చారు. రాజస్తాన్ నుంచి రాజ్యసభకు మన్మోహన్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2004 నుంచి 2014 వరకు ప్రధానమంత్రిగా దేశానికి సేవలు అందించారు. 1991లో ఆర్థికశాఖ మంత్రిగా కూడా పనిచేశారు.