కొన్ని ఎంటిఎంల్లో నో క్యాష్, కొన్ని బంద్: కారణమేమిటి?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: దేశంలోని కొన్ని ఎంటిఎంల్లో డబ్బులు లేవు. కొన్ని పనిచేయడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎంటిఎంలు ఎందుకు పనిచేయకపోవడానికి గల కారణం కచ్చితంగా తెలియడం లేదు.

అయితే, అందుకు రెండు కారణాలు ఉన్నట్లు అర్థమవుతోంది. కొత్తగా రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన రూ.200 నోట్లకు అనుగుణంగా ఎటిఎంల్లో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

పసుపు రంగులో గల కొత్త రూ.200 నోట్లకు అనుగుణంగా ఎంటిఎంల్లో మార్పులు చేయాలని రిజర్వ్ బ్యాంక్ నిరుడు జనవరి 4వ తేదీన బ్యాంకులను ఆదేశించింది. మొత్తం 2.2లక్షల ఎటిఎంలను అందుకు అనుగుణంగా మార్చాల్సి ఉంది.

Many ATMs facing problems: What could be the cause?

నోట్లను నిరుడు ఆగస్టులో విడుదల చేసినప్పటికీ చాలా ఎటిఎంలు వాటికి అనుగుణంగా లేవు. దీంతో బ్యాంక్ క్యాష్ కౌంటర్ల నుంచి తీసుకోవాల్సి వస్తోంది.

డిజిటల్ లావాదేవీలను మరింత వేగవంతం చేసే ప్రక్రియలో భాగంగా ఆ సమస్య తలెత్తినట్లు చెబుతున్నారు. ఇది పూర్తిగా పుకారు మాత్రమేనని తెలుస్తోంది. నిరుడు మే నుంచి నవంబర్ వరకు దేశవ్యాప్తంగా 1,782 ఎటిఎంలు మూతపడ్డాి. అయితే, రిజర్వ్ బ్యాంకు నుంచి కరెన్సీ సరఫరా ఏమీ తగ్గకపోయినప్పటికీ అవి మూత పడ్డాయి

2016 నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దు తర్వాత ఎటిఎంల్లో బ్యాంకులు మార్పులు చేశాయి. కొత్త రూ.500 నోట్లకు, రూ.2000 నోట్లకు అనుగుణంగా ఎటిఎంల్లో మార్పు లు చేశాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

Read in English: Many ATMs facing problems
English summary
Many ATM machines across the country are said to be either out of cash or are not working which is causing great inconvenience to people.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి