వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిడ్నాప్‌పై కేజ్రీవాల్: ఎఎపి మంత్రి 'మిడ్‌నైట్‌'పై ఎఫ్ఐఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉగ్రవాదుల నుండి ముప్పు పొంచి ఉందన్న ఢిల్లీ పోలీసులపై ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అనుమానం వ్యక్తం చేశారు. ఢిల్లీ పోలీసులు, కేంద్ర ప్రభుత్వం తన భద్రత విషయంలో రాజకీయాలకు పాల్పడుతున్నాయా? అన్నారు.

పోలీసు అధికారులు ఆదివారం ముప్పు గురించి తనకు చెప్పారని, ఈ విషయాన్ని బయటకు వెల్లడించరాదని తనకు చెప్పారని, ఆపై వారే మీడియాకు చెప్పారని, ఇదేమిటన్నారు. ఇప్పుడు ఎవరైనా తనపై దాడి చేసి, దానిని భత్కల్ మనుషులే చేశారని చెప్పవచ్చు. పోలీసులు రాజకీయాలు కట్టిపెట్టాలన్నారు.

arvind kejriwal

ఢిల్లీ మంత్రి అర్ధరాత్రి దాడిపై ఎఫ్ఐఆర్

ఢిల్లీ న్యాయ శాఖా మంత్రి సోమ్‌నాథ్ భారతిపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలని నగర మెట్రోపాలిటన్ కోర్టు పోలీసులను ఆదేశించింది. మాదక ద్రవ్యాలు, వ్యభిచార రాకెట్ నడుపుతున్నారంటూ గతవారం ఆఫ్రికన్ మహిళలు ఉంటున్న ఇంటిపై దాడికి మంత్రి ప్రయత్నించారు. అయితే ఈ సోదాలకు వారెంట్ లేదంటూ పోలీసులు దీనికి అంగీకరించలేదు.

దీంతో నడి రోడ్డుపై పోలీసు అధికారులతో ఆయన వాగ్వాదానికి దిగారు. నాటి ఘటనలో కొందరు తమను వేధింపులకు గురి చేశారని, వారిపై ఎఫ్ఐఆర్ దాఖలుకు ఆదేశాలివ్వాలని ఆ మహిళలు స్థానిక కోర్టులో దరఖాస్తు చేశారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి ఎఫ్ఐఆఱ్ దాఖలు చేయాలని ఆదేశించింది. దీంతో మాల్వియా నగర్ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అందులో భారతి పేరు లేదు. నిందితులను గుర్తించేందుకు వీలుగా నాటి ఘటనకు సంబంధించిన వీడియో దృశ్యాలు ఫిర్యాదుదారులకు చూపాలని కూడా జడ్జి ఆదేశించారు.

వైద్య పరీక్షల సందర్భంగా జననాంగాల్లో తనిఖీలు చేశారని, ఇది తమకు అవమానకరమైన అనుభవమని ఆఫ్రికన్ మహిళలు పేర్కొన్నారు. మూత్ర నమూనాలివ్వాలని మంత్రి, ఆయన అనుచరులు తమను బహిరంగంగా అడిగారని ఆరోపించారు. దీనిపై సోమనాథ్ భారతి స్పందిస్తూ.. తమ కార్యకర్తలెవరు ఎవరి పైన దాడి చేయలేదని, తప్పు చేయలేదన్నారు. మరోవైపు సోమనాథ్ భారతి రాజీనామా చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

English summary
Acting on court orders, Delhi Police registered a criminal case on Sunday against law minister Somnath Bharti and his supporters for misbehaving with African women in a south Delhi locality last week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X