51ఏళ్ల వయసులో 18ఏళ్ల గర్ల్ ఫ్రెండ్‌తో: కూతురా? అంటూ మిలింద్‌పై నెటిజెన్స్..

Subscribe to Oneindia Telugu

ముంబై: ప్రముఖ నటుడు, భారతీయ సూపర్‌మోడల్‌ మిలింద్‌ సోమన్‌ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫోటోలు హాట్ టాపిక్ గా మారాయి. అంకిత అనే మోడల్ తో మిలింద్ ప్రేమాయణం సాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. ఆమెతో కలిసి దిగిన ఫోటోలపై నెటిజెన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

51ఏళ్ల వయసున్న మిలింద్.. 18ఏళ్ల అంకితతో డేటింగ్ చేస్తుండటాన్ని పలువురు నెటిజెన్స్ తప్పుపడుతున్నారు. 'ఆమె నీ ప్రేయసా.. లేక కూతురా?' అంటూ సెటైర్స్ వేస్తున్నారు. ఈ వయసులో అంత చిన్నమ్మాయితో ప్రేమ ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు.

Milind Soman Posts Pic With Girlfriend Ankita

కాగా, 2006లో మిలింద్‌కి మైలీన్‌ అనే యువతితో వివాహమైంది. వ్యక్తిగత కారణాల వల్ల వీరిద్దరూ 2009లో విడిపోయారు. ఆ తర్వాత అంకితకు దగ్గరయ్యాడు. అప్పటినుంచి వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు బాలీవుడ్ కోడై కూస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Supermodel-turned-actor Milind Soman attended the Spring-Summer 2018 edition of Amazon India Fashion Week (AIFW) with girlfriend Ankita Konwar on Wednesday evening.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి