
వామ్మో.. మహిళల నరబలి, డబ్బిస్తామని ఆశచూపి ఘాతుకం, ఎక్కడ అంటే..?
అరచేతిలో ప్రపంచం కనిపిస్తోంది. ఏదీ కావాలన్న క్షణాల్లో జరిగిపోతోంది. రాకెట్లను నింగిలోకి పంపిస్తోన్నాం.. కానీ ఇప్పటికీ కొన్ని చోట్ల మూఢ నమ్మకాలను విశ్వసిస్తున్నారు. అవును ఏదో జరుగుతుందని (కలిసి వస్తోందని, బంగారం, నగదు, నగలు, పిల్లల కోసం) నరబలులు జరుగుతూనే ఉన్నాయి. దాదాపుగా మనం చిన్న పిల్లల బలులకు సంబంధించి చూశాం. కానీ కేరళలో ఇద్దరు మహిళలను నరబలి ఇచ్చారు.
కొచ్చి, కలాడికి చెందిన ఇద్దరు మహిళలు కనిపించడం లేదనే ఫిర్యాదు వచ్చింది. ఆ కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కేసు విన్నాకే సందేహం కలిగి, విచారణ చేపట్టారు. ఆ మిస్సయిన వారు నరబలికి గురయ్యారనే కఠోర వాస్తవం వెలుగులోకి వచ్చింది. పెరుంబవూరుకు చెందిన ఏజెంట్ పతనంతిట్టకు చెందిన జంటతో కలిసి ఈ దురాగతం చేశారని తెలిసింది. ఆర్థికంగా కలిసి రావడం కోసం.. రెండు ప్రాణాలను తీశారు. పాతనంతిట్టలో గల ఎలంతూర్‌లో దంపతుల ఈ హత్య జరిగింది.

పెరుంబవూరుకు చెందిన షఫీ అలియాస్ రషీద్ ఏజెంట్.. ఎలంతూరుకు చెందిన భగవల్ సింగ్, అతని భార్య లైలా ప్రధాన కుట్రదారు. వీరికి కలిసి రావడం కోసం ఇద్దరు అమాయకులను చంపారు. నరబలి ఇవ్వడం వల్ల ఆర్థికంగా కలిసి వస్తుందని దంపతులను షఫీ నమ్మించాడు. ఇంకేముంది ఆ అమాయకుల కోసం గాలించారు. డబ్బు ఇస్తామని చెప్పి.. ప్రాణం తీశారు.
కొచ్చిలోని ఎలంకులం నివాసి పద్మమ్, కాలడికి చెందిన రోస్లీని నమ్మించారు. డబ్బులు ఇస్తామని తీసుకెళ్లారు. అక్కడ వారిని నరబలి ఇచ్చారు. తర్వాత ఆ మృతదేహాలను దంపతుల ఇంటి ఆవరణలో ఖననం చేశారు. వారికి కలిసి వస్తోందని ఇలా చేశారు. కానీ ఇద్దరు అమాయకుల ప్రాణాలను తీశారు.