దోవల్ ను రంగంలోకి దించిన మోడీ : 'అస్సాం ఉగ్ర నిందితుల వేట'
న్యూఢిల్లీ : అసోంలో తీవ్రవాద దాడితో కేంద్రం అప్రమత్తమైంది. కోక్రాఝార్ మార్కెట్ పై ఉగ్రవాదులు విరుచుకుపడడంతో 13 మంది ప్రాణాలు కోల్పోగా.. 18మంది గాయపడ్డారు. కాగా దాడిని తీవ్రంగా పరిగణించిన కేంద్రం.. వెంటనే భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ను రంగంలోకి దింపింది.
ఉగ్రదాడిని నేషనల్ డెమోట్రిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ చేసిన చర్యగానే అనుమానిస్తోంది కేంద్రం. ఈ మేరకు భద్రతను అలర్ట్ ను చేసిన ప్రధాని మోడీ అజిత్ దోవల్ ను అసోంకి పంపించారు. భద్రతా సలహాదారుగా ఎన్నో ఆపరేషన్స్ ను సమర్థవంతంగా నిర్వహించిన దోవల్.. గతంలో బోడోలాండ్ తీవ్రవాదులను అణిచివేయడంలోను సఫలమయ్యారని చెబుతారు.

ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్ర కార్యకలాపాలకు తెరదించిన ట్రాక్ రికార్డు దోవల్ కు ఉండడంతో.. తాజా అసోం పరిస్థితులను కూడా దోవల్ నే సమీక్షించాల్సిందిగా మోడీ ఆదేశించారు. దాడికి సంబంధించిన వివరాలను చేధించడంతో పాటు ప్రధాన సూత్రధారులు ఎవరా అన్నదానిపై దోవల్ ఇప్పుడు తన కొత్త ఆపరేషన్ మొదలుపెట్టనున్నారు.












Click it and Unblock the Notifications