ట్రంప్ తో ప్రధాని మోదీ ఫోన్ కాల్.. ఈ అంశాలపైనే చర్చ..
భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ లో సంభాషించుకున్నారు. ప్రపంచ శాంతి, సుస్థిరత కోసం కలిసి పనిచేద్దామని నిర్ణయానికి వచ్చారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలపై సమీక్ష జరిపారు. ఓవైపు భారత్ పై అమెరికా సుంకాలు విధించిన నేపథ్యంలో ఇరు దేశాధినేతల మధ్య టెలిఫోన్ సంభాషణ ఆసక్తికరంగా మారింది. ఈ మేరకు ఇరు దేశాల మధ్య వాణిజ్యం, ఎనర్జీ, డిఫెన్స్ తదితర అంశాలపై చర్చలు జరిపారు. మున్ముందు భారత్- అమెరికా కలిసి పనిచేయాలని నిర్ణయానికి వచ్చారు.
ప్రధాని నరేంద్ర మోదీ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిసెంబర్ 11 న టెలిఫోన్ లో సంభాషణ జరిపారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలపై సమీక్ష చేశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, ఎనర్జీ, డిఫెన్స్ తదితర అంశాలపై చర్చలు జరిపారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా పోస్టు చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో సంతృప్తికరమైన చర్చ జరిగింది. ఇది హృదయపూర్వకమైన సంభాషణ. ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలలో పురోగతిని సమీక్షించాము. అలాగే ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చలు జరిపాము. ప్రపంచ శాంతి, స్థిరత్వం, సుస్థిరత కోసం భారత్- అమెరికా కలిసి పనిచేస్తూనే ఉంటాయి' అని ప్రధాని మోదీ ఎక్స్ ద్వారా పోస్టు చేశారు.

మరోవైపు భారత్ శత్రుదేశమైన పాకిస్థాన్ తో అమెరికా బిగ్ డీల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ కు చెందిన అత్యాధునిక F-16 యుద్ధ విమాన విడిభాగాలు, టెక్నాలజీ ట్రాన్స్ ఫర్ కు సంబంధించి 686 మిలియన్ డాలర్ల విలువైన భారీ ఆయుధ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం అందుతోంది. ఈ విషయాన్ని ప్రముఖ అంతర్జాతీయ పత్రిక డాన్.. తన కథనంలో వెల్లడించింది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య రక్షణ ఒప్పందాన్ని భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. అయితే పాకిస్థాన్- అమెరికా మధ్య ప్రస్తుతం ప్రతిపాదించిన ఈ ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్ F-16 విమానాల సముదాయాన్ని ఆధునీకరించడంతో పాటు వాటి ఆపరేషనల్ భద్రతా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకుందని సమాచారం.
-
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
"ఇరాన్ దెబ్బకు అమెరికా ఖతం.. పీకల్లోతు చిక్కుల్లో.." -
ట్రంప్ సీజ్ ఫైర్ కు నో..! మళ్లీ తీవ్రస్థాయికి ఇరాన్ వార్...! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..?












Click it and Unblock the Notifications