భర్తలు తాగొస్తే బ్యాట్లతో కొట్టండి: వధువులకు బ్యాట్లను గిఫ్ట్ గా ఇచ్చిన మంత్రి

Posted By:
Subscribe to Oneindia Telugu

భోపాల్: మధ్యప్రదేశ్ లో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు నిర్వహించారు. ఇందులో 700 మంది పెళ్ళికూతుళ్ళకు రాష్ట్ర సామాజిక న్యాయ, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి గోపాల్ భార్గవ నూతన వధువులకు వినూత్న బహుమతిని అందించారు.

తాగివచ్చే భర్తలను ముఖ్యంగా తాగి హింసించే భర్తలను కొట్టేందుకు బట్టలు ఉతికే బ్యాట్లను ఆయన బహుకరించాడు. తాను మొత్తం పదివేల బ్యాట్లను తయారు చేయించినట్టు ఆయన చెప్పారు.

భర్తలు గృహా హింసకు పాల్పడితే ఈ బ్యాట్లతో కొట్టండి అని ఆయన చెప్పారు. పోలీసులు ఈ కేసుల్లో జోక్యం చేసుకోవద్దు అంటూ ఆ బ్యాట్లపై రాసి మరీ ఇచ్చాడు.

MP minister presents washing bats to brides

మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో భర్తలు తాగొచ్చి భార్యలను హింసించడం సర్వసాధారణమైందన్నారు. అలాంటివారికి బుద్దిచెప్పాలంటే ఇలాంటి బ్యాట్లు అవసరమన్నారు మంత్రి. రాష్ట్రంలో గులాబీ గ్యాంగ్ ఆందోళన చూశాక తనకు ఈ ఆలోచన వచ్చిందన్నారు.

ఇటీవల వైన్ షాపులను మూసివేయాలనే డిమాండ్ చేస్తూ కొంతమంది మహిళలు గులాబీ రంగు చీరలు కట్టుకొని బ్యాట్లు పట్టుకొని వీధుల్లోకి వచ్చారు. ఇక ముందు కూడ పెళ్ళి కూతుళ్ళకు తాను ఈ బ్యాట్లను బహుకరిస్తానని చెప్పారు మంత్రి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Madhya Pradesh’s panchayat and rural development minister Gopal Bhargava has presented washing bats to newly-wed women, asking them to put the wooden plank to good use if their husbands come home drunk.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి