Video:కేరళకు వెళితే మున్నార్‌లోని ఆ హోటల్‌కు మాత్రం వెళ్లొద్దు..!!
కేరళలోని ఇడుక్కి జిల్లా, మూన్నార్ సమీపంలోని అనచల్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన 120 అడుగుల ఎత్తైన "స్కై డైనింగ్"హోటల్‌లో భారీ ప్రమాదం తృటిలో తప్పింది. హైడ్రాలిక్ క్రేన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో, ఆహారం తీసుకుంటున్న ఐదుగురు పర్యాటకులు దాదాపు మూడు గంటల పాటు గాలిలో 120 అడుగుల ఎత్తులో చిక్కుకుపోయారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి వారిని సురక్షితంగా రక్షించారు.
మొరాయించిన క్రేన్: ఏం జరిగింది?
మున్నార్‌లోని అనచల్‌లో స్కై డైనింగ్ పేరుతో ఒక వినూత్నమైన హోటల్ సేవలను అందిస్తున్నారు. భారీ క్రేన్ సహాయంతో ఒక డైనింగ్ ప్లాట్‌ఫామ్‌ను 120 అడుగుల ఎత్తుకు తీసుకెళ్లి, అక్కడ పర్యాటకులు ఆహారం తీసుకునే ఏర్పాట్లు చేశారు. నిన్న ఈ ప్లాట్‌ఫామ్‌పై మంగళూరుకు చెందిన ఐదుగురు పర్యాటకులు భోజనం చేస్తుండగా, ఉన్నట్టుండి క్రేన్ మొరాయించింది. క్రేన్‌కు శక్తిని అందించే హైడ్రాలిక్ సిస్టమ్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో, ప్లాట్‌ఫామ్ గాలిలో నిలిచిపోయింది.

మూడు గంటల పాటు నరకయాతన
120 అడుగుల ఎత్తులో ప్లాట్‌ఫామ్ వేలాడుతుండటంతో పర్యాటకులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. చిక్కుకుపోయిన వారిలో మంగళూరుకు చెందిన ఒకే కుటుంబానికి చెందినవారు ఉన్నారు. మొహమ్మద్ సఫ్వాన్ (31), అతని భార్య తౌఫీనా (25), వారి పిల్లలు ఇవాన్, ఇనారాతో పాటు హోటల్ సిబ్బంది హరిప్రియ ఉన్నారు.ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక, రెస్క్యూ సిబ్బంది క్రేన్‌ను సురక్షితంగా కిందికి దించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దాదాపు మూడు గంటల పాటు శ్రమించిన రెస్క్యూ సిబ్బంది.. చివరకు ప్లాట్‌ఫామ్‌ను నియంత్రిత పద్ధతిలో కిందికి దించి ఐదుగురిని సురక్షితంగా రక్షించగలిగారు.
దర్యాప్తునకు ఆదేశించిన పోలీసులు
ప్రమాదంపై మున్నార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హోటల్ నిర్వాహకులు ఈ హ్యాంగింగ్ హోటల్‌ను నడపడానికి అవసరమైన లైసెన్స్‌లు కలిగి ఉన్నారా, క్రేన్ మరియు ఇతర యంత్రాల నిర్వహణను చివరిసారిగా ఎప్పుడు తనిఖీ చేశారు అనే వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పర్యాటకుల భద్రతా ప్రమాణాలను హోటల్ పాటించిందా లేదా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications