వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నన్ను పదే పదే రేప్ చేశాడు: ఎమ్మెల్యేపై మహిళ

By Pratap
|
Google Oneindia TeluguNews

NCP leader and former state minister accused of rape
ముంబై: శాసనసభ్యుడు, ఎన్సీపి నేత, మాజీ మంత్రి లక్ష్మణరావు ధబోలే తనపై పదే పదే అత్యాచారం చేశాడని ఓ మహిళ ఆరోపించింది. ఈ మేరకు ఆయనపై కేసు నమోదైంది. మహారాష్ట్రలోని షోలాపూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ధబోలేపై ఐపిసి సెక్షన్లు 376 (అత్యాచారం), 323 (గాయపరచడం), 506 (బెదిరించడం) కింద బోరివాలి స్టేషన్‌లో కేసులు నమోదైనట్లు డిసిపి బల్‌సింగ్ తెలిపారు.

ధబోలేకు బాగా తెలిసిన కళాశాలలో పనిచేసే బాధితురాలు తనకు జరిగిన అన్యాయంపై శుక్రవారంనాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ అత్యాచారం గురించి ఎవరికైనా చెప్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని తనను హెచ్చరించాడని, అభ్యంతరకరంగా తనను ఫొటోలు తీసి వాటిని బయటపెడతానని బెదిరించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఫిర్యాదులోని అంశాలను పరిశీలిస్తున్నామని, ఆరోపణలను ధ్రువీకరించుకున్న తర్వాతనే అరెస్టులు ఉంటాయని పోలీసులు చెబుతున్నారు. ధబోల్ తనను తన క్యాబిన్‌కు మూడు సార్లు పిలిచాడని, ఇది కళాశాల పని పేరుతో తనను 2011, 2013 మధ్య పిలిపించాడని, తనపై అత్యాచారం చేశాడని, కొట్టాడని, అత్యాచారం చేశాడని, ఫొటోలు తీశాడని బాధితురాలు వివరించిదంి. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం పోలీసు స్టేషన్‌కు పంపించారు.

ఆ సంఘటనతో బోరవాలిలోని నలంద న్యాయశాస్త్ర కళాశాల మరోసారి వార్తల్లోకి ఎక్కింది. బాధితురాలు ఆ కళాశాలలోనే పనిచేస్తోంది. తమను కళాశాల యాజమాన్యం మోసం చేసిందంటూ విద్యార్థులు ఆరోపణలు చేయడంతో గత నెలలో ఈ కళాశాల వార్తల్లోకి వచ్చింది.

English summary

 The Nalanda Law College at Borivali West has once again hit the headlines for the wrong reasons after a female staffer has accused Laxman Dhoble, the founder of its trust, Shahu Shikshan Sanstha, of rape. Dhoble is a former water supply minister of Maharashtra from the NCP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X