వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

NEET 2020:వచ్చే ఏడాది మే 3న నీట్ పరీక్ష..అధికారిక నోటిఫికేషన్ విడుదల

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక నీట్ (NEET) 2020 పరీక్షకు అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. సోమవారం రోజున నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఎ‌న్‌టీఏ వెల్లడించింది. ఇందుకోసం అభ్యర్థులు ntaneet.nic.in అనే వెబ్‌సైట్‌పై లాగిన్ అయి అభ్యర్థి వివరాలు పూర్తి చేయాల్సి ఉంటుందని ఎన్‌టీఏ వెల్లడించింది.

డిసెంబర్ 31, 2019 రాత్రి 11:50 గంటల వరకు ఆన్‌లైన్ అప్లికేషన్లను స్వీకరిస్తామని వెల్లడించింది. చివరి తేదీ, సమయంను అభ్యర్థులు తప్పకుండా దృష్టిలో ఉంచుకోవాలని సూచించింది. చివరి తేదీ ఇచ్చిన సమయంలోగా రిజిస్ట్రేషన్ పూర్తి చేయకుంటే, ఆ తర్వాత లింక్ ఉండదని స్పష్టం చేసింది.

నేషనల్ మెడికల్ కమిషన్ చట్టం 2019లోని సెక్షన్ 14 ద్వారా మెడిసిన్ చదవాలనే అభ్యర్థులకు అందరికి ఉమ్మడి పరీక్ష నీట్ నిర్వహించడం జరుగుతుంది. ఇది అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ పొందేందుకు ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతోంది. ఎయిమ్స్, జిప్‌మర్, లాంటి ప్రతిష్టాత్మక మెడికల్ కాలేజీలకు కూడా అడ్మిషన్ నీట్ ద్వారానే జరుగుతుందని అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

NEET- 2020 official notification released,Exam on May 3rd 2020

అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యతేదీలు:

* నీట్ పరీక్ష : మే 3, 2020

* క్రెడిట్ కార్డు /డెబిట్ కార్డు /నెట్ బ్యాంకింగ్/యూపీఐ ద్వారా ఫీజు చెల్లింపు: డిసెంబర్ 2, 2019 నుంచి జనవరి 1, 2020.

* NTA వెబ్‌సైట్‌పై అప్లికేషన్‌లో ఏమైనా పొరపాట్లను సరిదిద్దుకునేందుకు : జనవరి 15-31, 2020

* అడ్మిట్ కార్డు లేదా హాల్‌ టికెట్స్ : మార్చి 27, 2020

* NTA వెబ్‌సైట్‌పై ఫలితాలు ప్రకటన: జూన్ 4, 2020

అప్లికేషన్ ఫీజు:

జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.1500 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఆర్థికంగా వెనక బడిన జనరల్ కేటగిరీ అభ్యర్థులు (EWS) మరియు ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అభ్యర్థులు రూ.1400 చెల్లించాల్సి ఉంటుంది. ట్రాన్స్ జెండర్ అభ్యర్థులు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు రూ.800 చెల్లించాల్సి ఉంటుంది. ఇక పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ పై ఉన్న ఇన్ఫర్మేషన్ బ్రోచర్‌ను డౌన్‌లోడ్ చేసుకుని చూడగలరు.

English summary
National Testing agency has released an official notification regarding NEET 2020 examination on Monday, December 2, 2019. The registration for the NEET 2020 examination will begin today at 4 pm.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X