వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Twist: కొత్త సీఎం కంటే ముందే కొత్త పోలీసు బాస్, షాక్ ఇచ్చి వెళ్లిపోయిన ఉద్దవ్ ఠాక్రే, ఇది జరిగింది !

|
Google Oneindia TeluguNews

ముంబాయి/థాణే: మహారాష్ట్రలో ఉద్దవ్ ఠాక్రే సంకీర్ణ ప్రభుత్వాన్ని కుప్పకూల్చిన శివసేన రెబల్ లీడర్ ఏక్ నాథ్ షిండే ఇప్పుడు ఏకంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడు ఎక్కువగా కొత్త ముఖాలు కనపడటానికి బీజేపీ, శివసేన రెబల్ నాయకులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ముఖ్యమంత్రిగా ఏక్ నాథ్ షిండే ప్రమాణస్వీకారం చేసే కొన్ని గంటల ముందు ముంబాయి సిటీ పోలీసు కమీషనర్ గా వివేక్ పణసాల్కర్ బాధ్యతలు స్వీకరించారు. వివేక్ పణసాల్కర్ నియాకంలో భారీ ట్విస్ట్ ఉంది. ఉద్దవ్ ఠాక్రే రాజీనామా చేసి ఇంటికి వెళ్లే ముందు ముంబాయి కమీషనర్ గా వివేక్ పణసాల్కర్ ను నియమించడం విశేషం.

షాక్ ఇచ్చిన ఉద్దవ్ ఠాక్రే

షాక్ ఇచ్చిన ఉద్దవ్ ఠాక్రే

మహారాష్ట్రకు కొత్త సీఎంగా ఏక్ నాథ్ షిండే ప్రమాణస్వీకారం చెయ్యకముందే ఆ రాష్ట్ర రాజధాని ముంబాయి నగరానికి కొత్త పోలీసు బాస్ వచ్చేశారు. అయితే బీజేపీ- శివసేన రెబల్ లీడర్స్ ముంబాయికి కొత్త కమీషనర్ ను నియమించలేదు. ఉద్దవ్ ఠాక్రే సీఎం పదవికి రాజీనామా చెయ్యకముందే ముంబాయి సిటీకి కొత్త కమీషనర్ గా వివేక్ పణసాల్కర్ ను నియమించి వెళ్లిపోయారు. ఉగ్రవాద నిరోదకదళం, ఏసీబీలో సిన్సియర్ పోలీసు అధికారిగా వివేక్ పణసాల్కర్ మంచి పేరు తెచ్చుకున్నారు.

 అప్పుడే డిసైడ్ అయిన ఉద్దవ్ ఠాక్రే

అప్పుడే డిసైడ్ అయిన ఉద్దవ్ ఠాక్రే

అసలు మ్యాటర్ ఏమిటంటే ఇంతకాలం ముంబాయి పోలీసు కమీషనర్ గా పని చేసిన సంజయ్ పాండే పదవి కాలం జూన్ 30వ తేదీకి ముగిసిపోయింది. సంజయ్ పాండే వారసుడిగా ముంబాయి కమీషనర్ గా వివేక్ పణసాల్కర్ ను నియమిస్తూ అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ఆదేశాలు జారీ చేశారు.

 ఏక్ నాథ్ చేతుల్లో ఉంది ?

ఏక్ నాథ్ చేతుల్లో ఉంది ?

అయితే పరిస్థితులు అనుకూలించక, సొంత పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చెయ్యడంతో ముంబాయి సిటీకి కొత్త పోలీసు కమీషనర్ గా వివేక్ పణసాల్కర్ బాధ్యతలు స్వీకరించే ఒక్కరోజు ముందు సీఎం పదవికి ఉద్దవ్ ఠాక్రే రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఉద్దవ్ ఠాక్రే మార్క్ మనిషిగా ముంబాయి సిటీ పోలీసు కమీషనర్ గా వివేక్ పణసాల్కర్ ఎంతకాలం ఉంటారో ఆ విషయం కొత్తగా ఏర్పాటు చేస్తున్న సంకీర్ణ ప్రభుత్వం పెద్దల చేతిలో ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

 సీఎం కంటే కొన్ని గంటల ముందు పోలీసు బాస్ !

సీఎం కంటే కొన్ని గంటల ముందు పోలీసు బాస్ !

మహారాష్ట్రకు కొత్త సీఎంగా ఏక్ నాథ్ షిండే ప్రమాణస్వీకారం చేసే కొన్ని గంటల ముందు ముంబాయి సిటీ పోలీసు కమీషనర్ గా వివేక్ పణసాల్కర్ బాధ్యతలు స్వీకరించారు. ఉద్దవ్ ఠాక్రే ఏరికోరి నియమించుకున్న సీనియర్ ఐపీఎస్ అధికారి వివేక్ పణసాల్కర్ కొత్త సీఎం ఏక్ నాథ్ షిండేతో, బీజేపీ నాయకులతో కలిసి ఎలా పని చేస్తారో వేచిచూడాలి. అయితే విధులు నిర్వహించడంతో మంచి పేరు తెచ్చుకున్న సీనియర్ ఐపీఎస్ అధికారి వివేక్ పణసాల్కర్ దేవేంద్ర ఫడ్నవిస్ సీఎంగా ఉన్న సమయంలో ఏటీఎస్ చీఫ్ గా పని చేశారు.

English summary
New police commissioner of Mumbai Vivek Phansalkar has good experience working in Anti-terrorism squad and Anti-corruption bureau.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X