
Amravati: అమరావతి వ్యాపారి హత్య కేసు ఎన్ఐఏ చేతికి, కేంద్ర హోమ్ శాఖ, ఉగ్రవాదులతో లింక్ ?
అమరావతి/ముంబాయి/ మహారాష్ట్ర: మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఔషద వ్యాపారి హత్య కేసును ఎన్ఐఏకి అప్పగిస్తున్నామని కేంద్ర మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. అమరావతిలో హత్యకు గురైన ఔషద వ్యాపారి ఉమేష్ ప్రహ్లాద్ రావ్ (54) కేసు ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చెయ్యడానికి సిద్దం అయ్యారు. ఔషద వ్యాపారి ఉమేష్ ప్రహ్లాద్ రావ్ హత్యకు, ఉగ్రవాదులకు ఏమైనా సంబంధం ఉందా ? అని మొత్తం మ్యాటర్ బయటకు లాగడానికి ఎన్ఐఏ అధికారులు సిద్దం అయ్యారు.
Wife: భార్యకు అక్రమ సంబంధం, ప్రియుడి దగ్గర రూ. 30 లక్షలు స్వాహా, క్లైమాక్స్ లో భార్య,భర్త !

అమరావతిలో ఔషద వ్యాపారి దారుణ హత్య
ఔషద వ్యాపారి ఉమేష్ ప్రహ్లాద్ రావ్ బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇదే విషయంలో రగిలిపోయిన ఓ వర్గం వాళ్లు జూన్ 21వ తేదీన ఔషద వ్యాపారి ఉమేష్ ప్రహ్లాద్ రావ్ ను అతి దారుణంగా హత్య చేశారు. వ్యాపారి ఉమేష్ ప్రహ్లాద్ హత్యకు నిరసనగా మహారాష్ట్రలోని అమరావతిలో తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యాయి.

హత్యకు, ఉగ్రవాదులకు సంబంధం ?
ఉమేష్ ప్రహ్లాద్ రావ్ ను హత్య చేసిన వారిని అరెస్టు చెయ్యాలని ఆందోళనకు దిగారు. ఔషద వ్యాపారి ఉమేష్ ప్రహ్లాద్ రావ్ హత్య కేసులో ఇప్పటికే అమరావతి పోలీసులు ఐదు మందిని అరెస్టు చేశారు. అయితే ఔషద వ్యాపారి ఉమేష్ ప్రహ్లాద్ రావ్ హత్యకు ఉగ్రవాదులకు ఏమైనా సంబంధం ఉందా అని పూర్తి సమాచారం బయటకు లాగడానికి కేసును ఎన్ఐఏతో దర్యాప్తు చేయిస్తున్నామని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖా ట్వీట్ చేసింది.

రాజస్థాన్ లో అరాచకం
మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టు చేసిన రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ కు చెందిన టైలర్ కన్హయ్య లాల్ ను ఇద్దరు వ్యక్తులు అతి కిరాతకంగా నరికి చంపేసి అతని తల పూర్తిగా తెగనరకడానికి ప్రయత్నించిన విషయం తెలిసిందే.

ప్రధానికి వార్నింగ్ ఇచ్చి వీడియో తీసిన కిరాతకులు
టైలర్ కన్హయ్యను దారుణంగా హత్య చేసిన నిందితులు రియాజ్ ఆఖ్తారీ, గౌస్ మోహమ్మద్ ప్రధాని నరేంద్ర మోదీని చంపేస్తామని బెదిరించి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యింది. టైలర్ కన్హయ్య లాల్ హత్యతో ఉదయ్ పూర్ ఉడికిపోతోంది. ఉదయ్ పూర్ లో ఇప్పటికే కర్ఫ్యూ అమలులో ఉంది. నెల రోజుల పాటు రాజస్థాన్ మొత్తం 144 సెక్షన్ విధించారు.