• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నీరవ్ మోడీ బంగ్లాను కూల్చేందుకు ఎన్ని డైనమైట్లు వాడుతున్నారో తెలుసా..?

|

ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంకుకు కుచ్చుటోపీ పెట్టి విదేశాల్లో తలదాచుకుంటున్న ఆర్థిక నేరగాడు నీరవ్ మోడీ ఎంతో ఇష్టంగా కట్టుకున్న అలీబాగ్‌లోని బంగ్లాను శుక్రవారం ఉదయం 10 గంటలకు రాయగడ్ జిల్లా కలెక్టర్ సమక్షంలో కూల్చనున్నారు. సాధారణంగా పెద్ద బుల్‌డోజర్లతో కూడా కూల్చలేమన్న అంచనాకు వచ్చిన అధికారులు 100 డైనమైట్లు వినియోగించి బంగ్లాను పడగొట్టనున్నారు. ఈ బంగ్లాను 30వేల చదరపు అడుగుల స్థలంలో నీరవ్ మోడీ నిర్మించుకున్నారు. అయితే తీరప్రాంత రెగ్యులేటరీ నిబంధనలను ఉల్లంఘించి బంగ్లాను నిర్మించుకోవడంతో ఈ అత్యంత విలాసవంతమైన బంగ్లాను అధికారులు కూల్చనున్నారు. ఒక్క బంగ్లానే కాదు... బంగ్లా బయట ఉన్న తోటను కూడా ధ్వంసం చేయనున్నారు అధికారులు.

నిబంధనలు ఉల్లంఘించి బంగ్లా నిర్మాణం

నిబంధనలు ఉల్లంఘించి బంగ్లా నిర్మాణం

నీరవ్ మోడీ నిబంధనలను ఉల్లంఘించి బంగ్లాను నిర్మించుకున్నారని తనకంటేముందు ఉన్న కలెక్టర్లు అనుమతులు ఇచ్చారని చెప్పారు ప్రస్తుత కలెక్టర్ విజయ్ సూర్యవన్షీ. అయితే అనుమతులపై సమీక్షించాల్సిందిగా రెవిన్యూ అధికారులను కోరడంతో వారు నివేదిక ఇచ్చారని అందులో నీరవ్ మోడీ అన్ని నిబంధనలను ఉల్లంఘించారని చెప్పడంతో వివరణ ఇవ్వాల్సిందిగా మూడు అవకాశాలు ఇచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. అయితే మూడుసార్లు వివరణ ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో బంగ్లాను కూల్చేందుకు నిర్ణయించుకున్నామని ఆ మేరకు ఆదేశాలు ఇచ్చినట్లు కలెక్టర్ విజయ్ సూర్యవంశీ తెలిపారు. నీరవ్ బంగ్లా నిర్మాణంలో కోస్టల్ రెగ్యులేటరీ జోన్ నిబంధనలే కాదు మహారాష్ట్ర ప్రాంతీయ టౌన్ ప్లానింగ్ చట్టాన్ని కూడా ఉల్లంఘించారని కలెక్టర్ వెల్లడించారు.

బంగ్లా స్తంభాల్లో బిగించనున్న డైనమైట్లు

బంగ్లా స్తంభాల్లో బిగించనున్న డైనమైట్లు

కోహిం బీచ్‌కు ఎదురుగా ఉన్న ఈ బంగ్లాను కూల్చేందుకు గత నెలరోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం పెద్ద మెషినరీని ఏర్పాటు చేసినప్పటికీ అవి కూల్చలేకపోయాయి.ఇక కూల్చే కార్యక్రమం వేగవంతంగా చేయాలని 100 డైనమైట్లతో ఇంటిని పేల్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఇందుకోసం అక్కడి కార్మికులు బంగ్లా స్తంభాలకు రంద్రాలు వేయడం కనిపించింది. ఈ రంద్రాల్లోనే డైనమైట్లు ఉంచి భవంతిని కూల్చుతారు. మొత్తం భవంతికి 14 పిల్లర్లు ఉండగా వాటన్నిటికీ రంద్రాలు వేసి అందులో డైనమైట్లు పెట్టి ఒకేసారి పేల్చేస్తామని కలెక్టర్ వెల్లడించారు. ఇలా చేస్తే మొత్తం బంగ్లా ఒక్క సారే కుప్పకూలుతుందన్నారు.

లోక్‌సభ ఎన్నికలు 2019: అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన కాంగ్రెస్..ప్రియాంకా పేరు మిస్సింగ్

నీరవ్ మోడీ బంగ్లా కూల్చేస్తామని బాంబే హైకోర్టుకు చెప్పిన ప్రభుత్వం

నీరవ్ మోడీ బంగ్లా కూల్చేస్తామని బాంబే హైకోర్టుకు చెప్పిన ప్రభుత్వం

ఇక అక్రమంగా నిర్మించుకున్న బంగ్లాను కూల్చేయాల్సిందిగా మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని బాంబే హైకోర్టుకు తెలిపింది. ఇక జనవరి 2019లో ఈ భవంతిని కలెక్టర్ చేతికి అప్పగించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే ఆ బంగ్లాలోని విలువైన వస్తువులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్ సీజ్ చేసింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
PNB scam accused businessman Nirav Modi’s luxury bungalow in Alibaug will be demolished by the office of the district Collector of Raigad at 10 am on Friday, 8 March. The demolition will be carried out through a controlled explosion using over 100 dynamites.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more