వామ్మో.. ఒమిక్రాన్.. డెల్టా కన్నా మూడు రెట్ల వేగంగా వ్యాప్తి, రాష్ట్రాలు, యూటీలను అలర్ట్ చేసిన కేంద్రం
ఒమిక్రాన్ వేరియంట్ బెంబేలెత్తిస్తోంది. కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కానీ నిపుణులు మాత్రం అబ్బే అదేం లేదు అని చెబుతున్నారు. ఇప్పటివరకు 12 మంది చనిపోవడం కూడా ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఒమిక్రాన్ గురించి మరో కొత్త విషయం తెలిసింది. గత ఏడాది గడ గడలాడించిన డెల్టా కన్నా ఇదీ 3 రెట్ల వేగంతో వ్యాప్తి చెందుతుందని తెలిపింది.
డెల్టా కన్నా మూడు రెట్ల వేగంతో వ్యాపిస్తోందని తెలియజేసింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను అలర్ట్ చేసింది. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని హెచ్చరించింది. ఒమిక్రాన్ వేరియంట్ కట్టడి కోసం క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని కోరింది. అంతేకాదు వైరస్ గుర్తించిన చోటును కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించాలని స్పష్టంచేసింది.

అంతేకాదు వార్ రూమ్ యాక్టివ్ చేయాలని కోరింది. జిల్లా, గ్రామ స్థాయిలో సీరియస్‌గా తీసుకోవాలని.. తగిన చర్యలు చేపట్టాలని స్పష్టంచేసింది. కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయాలని.. టెస్టుల సంఖ్య పెంచాలని.. పాజిటివ్ వచ్చిన వారిని వెంటనే ట్రాక్ చేయాలని.. వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది.
80 శాతం కేసుల్లో అసలు లక్షణాలే లేవని వైద్యారోగ్యశాఖ మంత్రి మాన్సుక్ మాండవీయ తెలిపారు. మరో 13 శాతం కేసుల్లో స్వల్ప లక్షణాలే ఉన్నట్టు చెప్పారు. దక్షిణాఫ్రికాలో తొలుత వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటి వరకు 100 దేశాలకు వ్యాప్తి చెందింది. యూరప్‌లో కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. అమెరికాలో సైతం ఈ రకం కేసులు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. అగ్రరాజ్యంలో ఒమిక్రాన్ సోకిన ఒకరు చనిపోయారు. దీంతో అమెరికా సహా అన్నీ దేశాలు భయపడుతున్నాయి.












Click it and Unblock the Notifications