వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Omicron:ట్రావెల్ బ్యాన్ పనిచేయదు, ఎలా అంటే.. వైద్య నిపుణుడు సంచలనం..

|
Google Oneindia TeluguNews

ఒమిక్రాన్ కరోనా వేరియంట్ వైరస్ తీవ్రత దృష్ట్యా భయాందోళన నెలకొంది. ఇతర దేశాలకు వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. దీంతో ట్రావెల్ బ్యాన్ చేయాలని అంతా భావించారు. దేశంలోకి కొత్త వేరియంట్ రాదని అనుకున్నారు. కానీ దీనికి సంబంధించి ఓ శాస్త్రవేత్త ఒకరు షాకింగ్ న్యూస్ వివరించారు. ట్రావెల్ బ్యాన్ అంతగా పనిచేయదని వివరించారు.

2 కేసులు

2 కేసులు


బెంగళూరులో 2 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. దేశంలోకి వేగంగా వేరియంట్ వచ్చిందని బ్రౌన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డిన్ డాక్టర్ ఆశిష్ కే ఝా తెలిపారు. ఇండియా టు డేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వైరస్ గురించి పలు విషయాలను వెల్లడించారు. వేరియంట్స్ చాలా సందర్భాల్లో వస్తాయని.. కానీ అన్నీ తీవ్రతతో ఉండవని వివరించారు. ఒమిక్రాన్ తీవ్రత ఎక్కువగా ఉందన్నారు. కానీ దానిని మనం సరయిన విధానంలో తట్టుకోగలం అని ఆశిష్ వివరించారు.

వేగంగా వ్యాప్తి

వేగంగా వ్యాప్తి

ఒమిక్రాన్ సులభంగా వేగంగా వ్యాపిస్తోందని ఆశిష్ తెలిపారు. స్వల్ప లక్షణాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని వివరించారు. అయితే వైరస్ మాత్రం ఈజీగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తోంది. సౌతాఫ్రికాలో డెల్టా కన్నా వేగంగా స్ప్రెడ్ అయ్యిందని చెప్పారు. వ్యాక్సిన్ పనిచేస్తుంది కానీ.. ఏ స్థాయిలో అనే విషయం చెప్పలేం అని వివరించారు. దీనికి సంబంధించి 10 రోజుల్లో స్పష్టత వస్తుందని చెప్పారు.

స్వల్ప లక్షణాలే

స్వల్ప లక్షణాలే

సౌతాఫ్రికాలో ఒమిక్రాన్ వచ్చిన వారు స్వల్ప లక్షణాలు వచ్చాయని అంగీకరించారు. డెల్టా కూడా యువతపైనే వచ్చిందని.. ఆరోగ్యంగా ఉన్నవారికి వచ్చిందని.. ఒమిక్రాన్ కూడా అదేవిధంగా ఉంటుందని చెప్పారు. అయితే వైరస్ సోకిన వారు.. రోగ నిరోధక శక్తి ఎక్కువగా లేనివారు వెంటనే ఆస్పత్రికి వచ్చారని వివరించారు. బూస్టర్ డోసు.. రిస్క్ ఎక్కువగా ఉన్నవారికి పనిచేస్తుందని అభిప్రాయపడ్డారు. అలాగే ట్రావెల్ బ్యాన్ పనిచేయదని ఆయన అభిప్రాయపడ్డారు. అదీ సౌతాఫ్రికాలో అయితే ఓకే కానీ.. మనదేశానికి వర్తించదని అభిప్రాయపడ్డారు. ఆర్టీ పీసీఆర్ పరీక్షతో ఒమిక్రాన్ వైరస్ గుర్తించలేమని తెలిపారు.

Recommended Video

Omicron Virus : Third Wave Alert In India | Lockdown | COVID Variant || Oneindia Telugu
అక్కడే టెస్ట్

అక్కడే టెస్ట్

ఇటు విదేశీ ప్రయాణికులకు ఎయిర్‌పోర్టుల్లోనే ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలు జరపాలని భారత ప్రభుత్వం తెలిపిన సంగతి తెలిసిందే. 'ఎట్‌ రిస్క్‌' జాబితాలోని దేశాల నుంచి వచ్చినవారికి ఇది తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఫలితాలు వచ్చే వరకూ ఎయిర్‌పోర్టులోనే ఉండాలని నిబంధన పెట్టింది. పాజిటివ్‌గా తేలినవారికి 14 రోజులు క్వారంటైన్‌, జన్యుక్రమ విశ్లేషణ కోసం వారి నమూనాలను ఇన్సాకాగ్‌కు పంపించాలని తెలిపింది. ప్యాసింజర్ల ట్రావెల్‌ హిస్టరీ సేకరించాలని సూచించింది.

English summary
Unfortunately, it’s a little too early to say—lots of reasons to consider. We see variants all the time Dean of the Brown University School of Public Health Dr. Ashish K. Jha said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X