పాకిస్థాన్ చర్యలతో కుల్‌భూషన్ జాదవ్ కేసుకు బ్రేకులు పడనున్నాయా ...
కశ్మీర్ విభజనతో పాకిస్థాన్ చేపట్టిన చర్యలు పాకిస్థాన్ చెరలో ఉన్న భారత మాజీ నేవీ కమాండర్ కుల్‌భూషన్ జాదవ్ కేసుకు బ్రేకులు పడినట్టేనా.. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై పున:సమీక్ష చేయాడంతోపాటు రెండు దేశాల మధ్య పలు రకాల సంబంధాలకు బ్రేకులు వేసింది. దీంతో భారత ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితంగా అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలతో కాన్సులర్ యాక్స్‌స్ ఇస్తామని ప్రకటించిన పాకిస్థాన్ జాదవ్ కేసులో వాదనలకు కూడ బ్రేకులు వేయనుందా..?

కశ్మీర్ పరిణామాలతో ద్వైపాక్షిక సంబంధాలకు బ్రేకులు వేసిన పాక్
కశ్మీర్ విభజన, ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్స్ తొలగింపు తర్వాత దాయాదీ దేశమైన పాకిస్థాన్ అనేక కుట్రలకు తెరతీసింది. ఈ నేపధ్యంలోనే రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పున:సమీక్షించాలని నిర్ణయించడంతో పాటురెండు దేశాల మధ్య ఉండే రాయబారులను సైతం బహిష్కరించింది. మరోవైపు వ్యాపారపరమైన సంబంధాలను కూడ రద్దు చేసింది. దీంతో వాఘ సరిహద్దును మూసివేయాలని నిర్ణయంతో పాటు రెండు దేశాల మధ్య మధ్య సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసి ద్వైపాక్షిక సంబంధాలకు బ్రేక్ వేసింది.

కుల్‌భూషన్ జాదవ్ కేసులో కాన్సులర్‌ను అనుమతిస్తుందా...?
ఈనేపథ్యంలోనే తమ చెరలో ఉన్న భారత మాజీ నేవీ కమాండర్ కులభూషణ్ జాధవ్‌ను కలిసేందుకు రాయబార అనుమతించినట్లు ప్రకటించిన దాయాది పాకిస్థాన్ దాని పురోగతికి కూడ బ్రేకులు వేయనున్నట్టు సమాచారం. కశ్మీర్ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న పాకిస్థాన్ పలు నిర్ణయాలు వెలువరించింది. దీంతో జాదవ్ కేసుపై వాదించేందుకు అనుమతించిన పాకిస్థాన్ దీనికి అంగీకరించే అవకాశం కూడ లేకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం పరిణామాల నేపథ్యంలో దీనికి ఫుల్‌స్టాప్ పడినట్టేనని పాకిస్థాన్ అధికారులు సైతం వెల్లడించినట్టు సమాచారం.

ఆగస్టు 2న కాన్సులర్ అనుమతి ఇస్తామని ప్రకటన
కాగా తమ ఆదీనంలో కులభూషణ్‌ను కలిసేందుకు ఆగస్టు 2న భారత్ అధికారులకు కాన్సులర్ యాక్సెస్ ఇస్తామని పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. తమ భూభాగంలో గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడుతున్నాడంటూ కుల్ భూషణ్ ను 2017లో అదుపులోకి తీసుకున్న పాకిస్థాన్ బలగాలు మరణ శిక్ష విధించారు. అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలతో కులభూషణ్ ను కలిసేందుకు భారత కాన్సులర్ అనుమతి ఇచ్చినట్లు పాక్ విదేశాంగ శాఖ తెలిపింది.

అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పుకు తలొగ్గిన పాకిస్థాన్
మరోవైపు జూలై 18న అంతర్జాతీయ కోర్టు విచారణ చేసి తీర్పును వెలువరించింది. కుల్ భూషణ్ జాదవ్‌కు మరణ శిక్షను రద్దు చేయాలని తీర్పు ఇచ్చింది. అంతేకాదు మరణశిక్ష విధించడంపై పునఃపరిశీలించాలని పాకిస్తాన్‌ను అంతర్జాతీయ కోర్టు కోరింది. కాగా ఇక ముందునుంచి భారత్ చెబుతున్నట్లుగా పాకిస్తాన్ వియన్నా కన్వెన్షన్‌ను ఉల్లంఘించిందని అంతర్జాతీయ న్యాయస్థానం అంగీకరించింది. అంతేకాదు జాదవ్ గూఢచర్యం చేయలేదని కూడ పేర్కొంది.
-
పెట్రోల్, గ్యాస్ సంక్షోభం.. దేశవ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్..?? -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!!












Click it and Unblock the Notifications