Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నేటినుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం: రేపే బడ్జెట్ .. షెడ్యూల్ ఇలా!!

నేటినుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. రేపే బడ్జెట్ ను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు సభల్లో ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఇలా ఉంది.

ప్రజలందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నేడు మొదలుకానున్నాయి. మరికొన్ని గంటల్లో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా, ఈరోజు రెండు సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ద్రౌపది ముర్ము ప్రసంగం తర్వాత దేశ ఆర్థిక పరిస్థితిని చెప్పే ఆర్థిక సర్వేను రెండు సభలలోను ప్రవేశపెడతారు. ఇక ఈ సర్వే ఆధారంగా రేపు పార్లమెంట్లో ప్రవేశపెట్టే బడ్జెట్ ఎలా ఉండబోతుంది అన్నదానిపై కొన్ని అంచనాలను వేసుకోవడానికి వీలు కలుగుతుంది. ఈరోజు, రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం, బడ్జెట్ ఉన్న నేపథ్యంలో జీరో అవర్, క్వశ్చన్ అవర్ ఉండవు.

రేపే బడ్జెట్.. ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టనున్న నిర్మల సీతారామన్

రేపే బడ్జెట్.. ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టనున్న నిర్మల సీతారామన్


ఇక రేపు అత్యంత కీలకమైనటువంటి రోజు.. దేశ ప్రజలందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 2023-2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంటు రెండు సభల్లోనూ ప్రవేశపెడతారు. రేపు ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సాధారణ బడ్జెట్ ను ముందుగా లోక్సభలో, తర్వాత రాజ్యసభలో ప్రవేశపెడతారు. గురువారం రోజు రెండు సభలు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చను మొదలుపెడతాయి. ఇక ఈ చర్చలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు సభల్లోనూ మాట్లాడతారు.

 రెండు విడతలుగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

రెండు విడతలుగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

ఈసారి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు దశల్లో జరగనున్నాయి. మొదటి విడత జనవరి 31వ తేదీన మొదలై ఫిబ్రవరి 13 వరకు ఉంటుంది. రెండవ విడత మార్చి 13వ తేదీన మొదలై ఏప్రిల్ ఆరవ తేదీ వరకు కొనసాగుతుంది. మొత్తంగా 27 రోజుల పాటు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. ఇదిలా ఉంటే ఈరోజు రేపు జీరో అవర్, క్వశ్చన్ అవర్ ఉండవు కాబట్టి ప్రతిపక్షాలు ఏదైనా అడగాలి అనుకుంటే ఫిబ్రవరి 2వ తేదీన జరిగే జీరో అవర్లో అడగాల్సి ఉంటుందని ఇప్పటికే పార్లమెంటరీ బులిటెన్ లో వెల్లడి చేసింది.

 పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఎవరి వ్యూహాలు వారివే

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఎవరి వ్యూహాలు వారివే

ఇక ఇప్పటికే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీలు ఎవరికి వారు వ్యూహాత్మకంగా వ్యవహరించాలని ప్రయత్నిస్తున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను ప్రశాంతంగా కొనసాగేలా చూడాలని కేంద్రంలోని అధికారి బిజెపి భావిస్తుంటే, పార్లమెంటు బడ్జెట్ సమావేశాల కేంద్రంగా బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని ప్రతిపక్ష పార్టీలు రెడీ అవుతున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని నిన్న కేంద్ర ప్రభుత్వం అన్ని పార్టీల సమావేశంలో ప్రతిపక్షాలను కోరింది. ఇక ఈ సమావేశానికి 27 పార్టీల తరఫున 37 మంది సభ్యులు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశానికి హాజరు కాలేదు.

 నిన్న జరిగిన ఆల్ పార్టీ మీటింగ్ లో అనేక అంశాలపై చర్చ కోరిన పార్టీలు.. సాధ్యం కాదన్న కేంద్రం

నిన్న జరిగిన ఆల్ పార్టీ మీటింగ్ లో అనేక అంశాలపై చర్చ కోరిన పార్టీలు.. సాధ్యం కాదన్న కేంద్రం

ఇక నిన్న జరిగిన ఆల్ పార్టీ మీటింగ్ లో చైనా అక్రమణాలపై చర్చలు జరపాలని బీఎస్పీ కోరింది. అయితే ఈసారి బడ్జెట్ సమావేశాలు కావడంతో, బడ్జెట్ పై చర్చించడం కీలకంగా కాబట్టి, చైనా పై చర్చ చేసేందుకు అవకాశం లేదని కేంద్రం వెల్లడించింది. ఇక ఇదే సమయంలో నిబంధనల ప్రకారం ఏ అంశం పైన అయినా చర్చకు అనుమతి ఇస్తామంటూ పేర్కొంది. అటు ఆమ్ ఆద్మీ పార్టీ, ఆర్జెడి పార్టీ వ్యాపారవేత్త అదానీ అంశంపై చర్చించాలని కోరాయి. ఇక దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని వైసిపి కోరగా కేంద్రం మాత్రం అనేక రాజకీయ పార్టీలు అడిగిన అంశాలపై పాజిటివ్ గా స్పందించలేదు. మరి ఈ బడ్జెట్ సమావేశాలలో ఏం జరగబోతుందో వేచి చూద్దాం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+