coronavirus impact covid 19 Coronavirus india chinese PM modi indians congress spokesperson కరోనా వైరస్ కోవిడ్ 19 ఇండియా ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలు కాంగ్రెస్ అధికార ప్రతినిధి politics
lockdown ఎప్పుడు మొత్తం తీసేస్తారు, ప్రధాని మోడీకి కాంగ్రెస్ పార్టీ ప్రశ్న..
ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీ ఫైరయ్యింది. లాక్ డౌన్‌పై ఎలాంటి విధానం అవలంభిస్తున్నారో తెలియజేయాలని కోరింది. మూడో విడత లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో.. మొత్తంగా ఎప్పుడు తీసివేస్తారో తెలియజేయాలని కోరారు. దీనిపై 130 కోట్ల మందికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రధానిని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ప్రశ్నించారు.
లాక్ డౌన్‌పై కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక లేకుండా ముందుకెళ్తుందని చెప్పారు. అందుకే ఆశించిన మేర కేసులు తగ్గడం లేదు అని సుర్జేవాలా అభిప్రాయపడ్డారు. లాక్ డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థకు కుదలైందని.. నివారణ చర్యలు ఏం తీసుకున్నారని ప్రశ్నించారు. వైరస్ ప్రబలుతోన్న నేపథ్యంలో లాక్ డౌన్ విధిస్తే సరిపోతుందా..? ఆర్థిక వ్యవస్థను పునరుద్దరించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. కానీ మోడీ మాత్రం ఇదేమీ పట్టనట్టు ఉన్నారని మండిపడ్డారు.

రెండో విడత లాక్ డౌన్ మే 3వ తేదీన ముగియనున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గకపోవడంతో మరో రెండువారాలు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ శుక్రవారం సాయంత్రం ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ లాక్ డౌన్ పై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.