చెప్పినట్లుగానే.. మోడీ వీఐపీ కాదని నిరూపించుకున్నారు!

Subscribe to Oneindia Telugu

కేదార్‌నాథ్‌: ప్రధాని నరేంద్ర మోడీ మన దేశంలో వీఐపీలు ఎవరూ లేరు.. దేశ ప్రజలందరూ వీఐపీలే అని చెప్పినట్లుగానే చేశారు. మోడీ బుధవారం ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కేదార్‌నాథ్‌ ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్లారు.

ఈ నేపథ్యంలో కేదారేశ్వరుడిని దర్శనానికి వెళుతుండగా మోడీ తన బూట్లు విప్పడానికి కూర్చున్నారు. ఇంతలో పక్కనే ఉన్న ఓ వ్యక్తి మోడీ సాయంగా వచ్చాడు. అయితే మోడీ అతని చేయిపట్టుకుని వద్దంటూ తన బూట్లు తానే విప్పుకుని ఆలయం లోనికి వెళ్లారు.

PM Narendra Modi offers prayers at Kedarnath temple in Uttarakhand

దేశవ్యాప్తంగా వీఐపీ మర్యాదల్ని నిషేధించాలని.. భారతీయులందరూ వీఐపీలేనని ఇటీవల 'మన్‌ కీ బాత్‌' కార్యక్రమంలో మోడీ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఇలా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కాగా, 28 ఏళ్ల‌లో కేదార్‌నాథ్‌లో రుద్రాభిషేకం జ‌రిపించిన తొలి ప్ర‌ధానిగా కూడా మోడీ నిలిచారు. 28 ఏళ్ల క్రితం వీపీ సింగ్ రుద్రాభిషేకం చేశారు. ఆరునెలల శీతకాల విరామం అనంతరం కేదార్‌నాథ్ ఆలయం సందర్శన ఈ రోజు నుంచి ప్రారంభమైంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Prime Minister Narendra Modi this morning offered prayers at the Kedarnath temple in Uttarakhand which reopened today following a six-month winter break.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి