viral video: నీ తండ్రులు దిగిరావాలె -అరెస్టు చేసే దమ్ముందా? అంటూ పతంజలి రాందేవ్ శివాలు
కరోనా విలయం ఉధృతంగా కొనసాగుతూ ప్రతిరోజూ 4వేల మంది ప్రాణాలు కోల్పోతుండా, ప్రజల్ని మరింత గందరగోళంలోకి నెట్టేస్తూ ఆధునిక వైద్య విధానాలపై ప్రఖ్యాత యోగా గురు, పతంజలి సంస్థ వ్యవస్థాపకుడు రాందేవ్ బాబా చేస్తోన్న విమర్శల పరంపర కొనసాగుతున్నది. కరోనాకు అల్లోపతి వైద్యం పనికిరాదంటూ, ఆధునిక వైద్యాన్ని స్టుపిడ్ సైన్స్(పనికిమాలిన శాస్త్రం)గా అభివర్ణించి, అల్లోపతి డాక్టర్లకు 25 ప్రశ్నలు సంధించిన రాందేవ్.. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వానికే సవాళ్లు విసురుతున్నారు.
అల్లోపతి వైద్యం, కరోనా వ్యాక్సిన్లపై రాందేవ్ బాబా చేస్తోన్న వ్యతిరేక ప్రచారం దేశద్రోహం కిందికి వస్తుందని, ఆయనపై వెంటనే సెడిషన్ కేసు బుక్ చేసి అరెస్టు చేయించాలంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) బుధవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయడం తెలిసిందే. ఆ క్రమంలోనే రాందేవ్ అరెస్టుకు సోషల్ మీడియాలోనూ డిమాండ్ వెల్లువెత్తింది.

తన అరెస్టుకు డిమాడ్లు, ఐఎంఏ విమర్శలపై స్పందిస్తూ రాందేవ్.. ''నన్ను అరెస్టు చేయాలంటే మీ తండ్రులు దిగిరావాలె. అనవసరంగా గోల చేస్తున్నారు. నా అరెస్టుపై ట్విటర్ లో ట్రెండింగ్ చేస్తున్నారు. గతంలోనూ నాపై అనుచిత ఆరోపణలతో పేరును ట్రెండ్ చేశారు. దోపిడీదారుణ్నని తిట్టిపోశారు. ఇదంతా వాళ్లకు అలవాటే. ఏదో ఒక విధంగా నన్నైతే ట్రెండింగ్ లో నిలబెడతారు. అందుకు ధన్యవాదాలు..'' అంటూ యోగాగురు మాట్లాడిన వీడియో క్లిప్ ఒకటి వైరల్ గా మారింది.
Ramdev challenges Modi Govt into arresting him, says "UNKA BAAP BHI ARREST NAHI KAR SAKTA"
— Gaurav Pandhi (@GauravPandhi) May 25, 2021
Over to you, @narendramodi @AmitShah !!
pic.twitter.com/73qd8AVLZE
అల్లోపతి వైద్యం, వ్యాక్సిన్లపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తోన్న రాందేవ్ పై ఐఎంఏ ఉత్తరాఖండ్ విభాగం రూ.1000 కోట్ల పరువునష్టం దాకా వేసింది. ఐఎంఏ జాతీయ కమిటీ నేరుగా ప్రధాని మోదీకే లేఖ రాసింది. కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్ యోగా బాబాను హెచ్చరించినా ఫలితం రాలేదు. ప్రధానికి ఫిర్యాదు చేసిన తర్వాత కూడా రాందేవ్ ఇంకా సవాళ్లు విసురుతుండటంతో తదుపరి ఏం చేయాలనేదానిపై ఐఎంఏ ఆలోచన చేస్తున్నది..
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications