Rebel: వెన్నుపోటు ఇలాగే పొడిచారు, సంజయ్ ట్విట్, ఫోటో వైరల్, సీఎంకు షాక్ ఇచ్చిన ఎంపీ !
ముంబాయి/ థాణే: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్ నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో శివసేన సీనియర్ నాయకుడు ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ చేసిన ట్వీట్, ఫోటో వైరల్ అయ్యింది. శివసేన చీఫ్ కు వెన్నుపోటు పొడిచిన నాయకులను ఉద్దేశించి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది.
మహరాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేని ఇలాగే వెన్నుపోటు పొడిచారని ఓ వ్యక్తి వీపులో కత్తితో పొడిచినట్లు ఉన్న ఫోటో ట్విట్టర్ లో పోస్టు చేసిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ శివసేన రెబల్ ఎమ్మెల్యేత మీద విమర్శలు గుప్పించారు. ఏక్ నాథ్ షిండే సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తున్న రోజే సంజయ్ రౌత్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఏక్ నాథ్ షిండేతో పాటు 39 మంది శివసేన ఎమ్మెల్యేలు మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన సమయంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఉద్దవ్ ఠాక్రే వెంటనే ఉన్నారు. గుహవాటిలో ఉన్న శివసేన రెబల్ ఎమ్మెల్యేలను ముంబాయి పిలుచుకుని రావాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అనేక ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే.
సీఎం పదవికి ఉద్దవ్ ఠాక్రే రాజీనామా చేసిన సమయంలో శివసేన రెబల్ నాయకుల మీద సంజయ్ రౌత్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏక్ నాధ్ షిండే కాని, ఆయన వర్గం ఎమ్మెల్యేలు కాని ఒక్క అడుగు కూడా వెనక్కి వెయ్యకపోవడంతో ఉద్దవ్ ఠాక్రే ఆయన సీఎం పదవికి రాజీనామా చేసి సైలెంట్ అయిపోయారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications