5 కోట్లకు చేరుకొన్న జియో ప్రైమ్ చందాదారులు

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: టెలికం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో మరో మైలు రాయిని అందుకొంది. రిలయన్స్ జియో 5 కోట్ల మంది చెల్లింపు వినియోగదారులను స్వంతం చేసుకొంది. ఈ నెలాఖరు నుండి రిలయన్స్ జియో ఉచిత సేవలను అందించనుంది.

రిలయన్స్ మాత్రం ఉచిత సేవలను అందిస్తామని ప్రకటన చేసింది..ఈ ప్రకటనకు అనుగుణంగానే ఉచిత వాయిస్ కాల్స్ ను, డేటాను అందించింది. ఈ ఉచిత సేవలను ఆరు మాసాల పాటు జియో కొనసాగించింది.

reliance jio

రిలయన్స్ జియో ఉచిత సేవలను పది కోట్లను చేరుకొంది.అయితే ఇందులో ఇప్పటికే పేమెంట్ చందాదారులుగా ఐదు కోట్ల మంది తమ పేర్లను నమోదు చేసుకొన్నారు.

అతి తక్కువ ధరకే ఉచిత డేటాను పొందేందుకు వీలుగా రూ.99 రీ ఛార్జీ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం జియోకు పది నుండి 11 కోట్ల మద్య వినియోగదారులున్నారు.

ఇందులో 30 శాతం మంది కేవలం ఉచిత డేటా వినియోగానికి మాత్రమే జియోను తీసుకొన్నారని అంచనా
.అంటే 7 కోట్ల మంది వినియోగదారులను జియో తన చెల్లింపు వినియోగదారులుగా మార్చుకోవాలనుకొంటుంది.

రిలయన్స్ జియో 5 కోట్ల మంది వినియోగదారులతో జియో అతిపెద్ద బ్రాడ్ బ్యాండ్ సేవలందిస్తున్న సంస్తగా ఎదిగింది. ఇప్పటికే టెలికం రంగంలో అగ్రగామిగీా ఉన్న ఎయిర్ టెల్ కు ఈ సేవల పరంగా చూసుకొంటే గత డిసెంబర్ నాటి ఈ సంఖ్య 3,7 కోట్లు మాత్రమే ఉంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
reliance jio reached 5 crore paying subscribers.reliance jio free offer end on march 31 2017.
Please Wait while comments are loading...