రూ.9,900కు 32 అంగుళాల టీవీ: రింగింగ్ బెల్స్ ఆవిష్కరణ

Posted By:
Subscribe to Oneindia Telugu

ఢిల్లీ: రూ.251కే స్మార్ట్ ఫోన్ అంటూ ప్రకటించి సంచలనం సృష్టించిన రింగింగ్ బెల్స్ తాజాగా.. రూ.9,900కు ఎల్ఈడీ టీవీని ఆవిష్కరించింది. గతంలో తాము విడుదల చేసిన రూ.251 స్మార్ట్ ఫోన్ ఫ్రీడమ్ 251 డెలివరీలు రేపటి నుంచి ప్రారంభిస్తామని సంస్థ సీఈఓ మోహిత్ గోయల్ గురువారం నాడు వెల్లడించారు.

Ringing Bells Freedom 251 LED TV launched for Rs 9,900

ఈ రోజు న్యూఢిల్లీలో ఎల్ఈడీ టీవీలను ఆవిష్కరించిన ఆయన, మీడియాతో మాట్లాడారు. ఎల్ఈడీ టీవీతో పాటే మూడు రకాల ఫీచర్ ఫోన్లను, రెండు స్మార్ట్ ఫోన్లను కూడా విడుదల చేస్తున్నట్టు చెప్పారు. తాము విడి భాగాలను తెచ్చి వాటితో ఉత్పత్తులను తయారు చేస్తున్నామన్నారు.

అన్ని ఖర్చులనూ లెక్కించిన తర్వాతనే ధరలను నిర్ణయిస్తున్నామన్నారు. హిట్, కింగ్, బాస్, రాజా పేరిట నాలుగు ఫీచర్ ఫోన్లను రూ.699 నుంచి రూ.1099 ధరల మధ్య, ఎలిగెంట్ 3జీ ఫోన్‌ను రూ.3,999కు, ఎలిగెంట్ 4జీ ఫోన్‌ను రూ.4,999కు విడుదల చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఎల్ఈడీ టీవీల డెలివరీని ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తామని చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Freedom 251 maker Ringing Bells today announced the launch of an ultra-affordable LED TV in India.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి